Operation Raavan OTT: ఓటీటీలోకి తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

ప‌లాస 1978 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి. దీని తర్వాత నరకాసుర వంటి డిఫరెంట్ మూవీలోనూ నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ కాలేదు. దీంతో 'ఆపరేషన్ రావణ్' అంటూ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో రక్షిత్ తండ్రి వెంకట్ సత్య స్వయంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం

Operation Raavan OTT: ఓటీటీలోకి తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Operation Raavan Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 05, 2024 | 4:23 PM

ప‌లాస 1978 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి. దీని తర్వాత నరకాసుర వంటి డిఫరెంట్ మూవీలోనూ నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ కాలేదు. దీంతో ‘ఆపరేషన్ రావణ్’ అంటూ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో రక్షిత్ తండ్రి వెంకట్ సత్య స్వయంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ మూవీలో సంగీర్తన విపిన్‌ కథానాయికగా నటించింది. ఆమని, ర‌ఘు కుంచే, రాధికా శ‌ర‌త్‌కుమార్ తదితర సీనియర్ నటీనటులు కీల‌క పాత్ర‌ల్లో మెరిశారు. జూలై 26న తెలుగు తో పాటు తమిళ భాషల్లోనూ ఒకేసారి రిలీజై ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. సైకో థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అని చెప్పినా పెద్దగా ట్విస్టులు లేకపోవడంతో జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఆపరేషన్ రావణ్ ఓ మోస్తరు కలెక్షన్లకే పరిమితమైంది. థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఆపరేషన్ రావణ్ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో సెప్టెంబ‌ర్ 13 నుంచి ఆపరేషన్ రావణ్ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఆప‌రేష‌న్ రావ‌ణ్ సినిమాకు శ‌ర‌వ‌ణ వాసుదేవ‌న్ మ్యూజిక్ అందించాడు.నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. మరి థియేటర్లలో ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ అయ్యారా? అయితే మరికొన్ని రోజులు ఆగండి. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆపరేషన్ రావణ్ మూవీ ప్రమోషన్లలో హీరో రక్షిత్ అట్లూరి..

&

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి