AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Double Ismart OTT : సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్.. ఎక్కడ స్త్రీమింగ్ అవుతుందంటే..

ఆగస్టు 15న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో రామ్‌కు జోడీగా కావ్య థాపర్ నటించింది. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈసినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. సంజయ్ దత్‌, సాయాజీ షిండే, గెటప్‌ శ్రీను, ప్రగతి, ఉత్తేజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. 

Double Ismart  OTT : సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్.. ఎక్కడ స్త్రీమింగ్ అవుతుందంటే..
Double Ismart
Rajeev Rayala
|

Updated on: Sep 05, 2024 | 9:16 AM

Share

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. ఇక పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించాడు. ఆ మధ్య రామ్ పోతినేని హిట్స్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు. ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న రామ్ పోతినేని ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రామ్ యాస, యాటిట్యూడ్, నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పూరి మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఇక ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, నభనటేష్ హీరోయిన్స్ గా నటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ ను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ఆంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

ఆగస్టు 15న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో రామ్‌కు జోడీగా కావ్య థాపర్ నటించింది. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈసినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. సంజయ్ దత్‌, సాయాజీ షిండే, గెటప్‌ శ్రీను, ప్రగతి, ఉత్తేజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూశారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో మిస్ అయిన వారు. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో చూడొచ్చు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా కథ విషయానికొస్తే .. ఇస్మార్ట్ శంకర్ (రామ్) తలలో ఓ చిప్ పెట్టుకొని తిరుగుతుంటాడు. అదే సమయంలో లండన్‌లో ఉంటున్న ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బిగ్ బుల్ (నటుడు సంజయ్ దత్) కు ఓ అనారోగ్య సమస్య వస్తుంది. బిగ్ బుల్ కు మెదడుకు సంబంధించిన సమస్య వస్తుంది.. అతను బిగ్ బుల్‌లా బతకాలంటే అతని మెమొరీని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాలని డాక్టర్స్ చెప్తారు. అలాంటివాడు హైదరాబాద్ లో ఉంటున్నాడని తెలుస్తుంది. దాంతో ఇండియాకు వచ్చి ఇస్మార్ట్ శంకర్ కోసం వెతుకుతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ. ఇస్మార్ట్ శంకర్ జీవితంలోకి జన్నత్ (కావ్య) ఎలా వచ్చింది.? అనేది పూర్తి కథ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..