Year Ender 2023: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి రానా నాయుడు వరకు.. ఈ ఏడాది ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమాలు, సిరీస్‌లివే
మరికొన్ని రోజుల్లో 2023 ముగియనండడం, 2024 రానుండడంతో ఈ ఏడాది తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా ఆదరణకు నోచుకున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీషోల జాబితాను విడదల చేసింది. అయితే ఈ జాబితాలో టాప్-10లో ఒక్క భారతీయ సినిమా కానీ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దాదాపు ప్రతి వారం వారం టాప్ స్ట్రీమింగ్ సినిమాల జాబితాను విడుదల చేస్తోంది. తమ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ అవుతోన్న సినిమాలకు వచ్చిన వ్యూస్ ఆధారంగా ఈ లిస్టును విడుదల చేస్తుంది. అయితే ఈసారి వార్షిక జాబితా విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. మరికొన్ని రోజుల్లో 2023 ముగియనండడం, 2024 రానుండడంతో ఈ ఏడాది తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా ఆదరణకు నోచుకున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీషోల జాబితాను విడదల చేసింది. అయితే ఈ జాబితాలో టాప్-10లో ఒక్క భారతీయ సినిమా కానీ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వెంకీ మామ రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ -400లో స్థానం దక్కించుకుంది. ఈ లిస్టులో 336వ స్థానంలో నిలిచిన రానా నాయుడు.. ఇండియా నుండి చోటు దక్కించుకున్న ఏకైక వెబ్ సిరీస్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్ కు 46 మిలియన్ల గంటలు వైవర్షిప్ వచ్చినట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో ‘చోర్ నికల్కే భగా’, ‘మిషన్ మజ్ను’ సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ‘ఇండియన్ మ్యాచ్ మేకింగ్’ రియాల్టీ షో ఉంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఆర్‌ఆర్‌ఆర్, ‘మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ రణబీర్ కపూర్ ‘తు ఝూటీ మే మక్కర్’, కార్తీక్ ఆర్యన్ ‘షెహజాదా’లు కూడా మంచి ఆదరణ దక్కించుకున్నాయి.
విమర్శలు వచ్చినా ..
No. 1 show on Netflix India for 2023, and the only Indian show to make it amongst the top 400 of Netflix internationally.
I have reasons to be proud. 🙂 https://t.co/K9lYjARaBa pic.twitter.com/b4eaBVvdyb
— Vaibhav Vishal (@ofnosurnamefame) December 13, 2023
ఆర్ఆర్ఆర్ కు కూడా భారీ వ్యూస్..
#RRRmovie was viewed for nearly 30 million hours from January to June 2023, according to the latest report released by Netflix. The movie made its debut on Netflix on May 20, 2022. Overall viewing hours is a 100 million + probably the first Indian movie to reach this milestone pic.twitter.com/C3Giz0J5Cu
— Rick Sulgie (@Aloydinkan) December 13, 2023
నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న టాప్-10 సినిమాలు, షోస్ ఇవే..
- ‘ది నైట్ ఏజెంట్’ సీజన్ 1
- ‘గిన్నీ మరియు జార్జియా’ సీజన్ 2
- ‘ది గ్లోరీ’ సీజన్ 1
- ‘బుధవారం’ సీజన్ 1
- ‘క్వీన్ షార్లెట్: ది బ్రిడ్జర్టన్ స్టోరీ’
- ‘యు’ సీజన్ 4
- ‘లా రీనా డెన్ సుర్’ సీజన్ 3
- ‘అవుటర్ బ్యాంక్స్’ సీజన్ 3
- ‘గిన్నీ మరియు జార్జియా’ సీజన్ 1
- ‘ఫ్యూబర్’ సీజన్ 1
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..