Tollywood: గెట్ రెడీ.. ఆగస్ట్ 15న విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఆ రెండు చాలా స్పెషల్..
ప్రతి వారం థియేటర్లలోకి, ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్న సంగతి తెలిసిందే. నిత్యం జనాలను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త జానర్ చిత్రాలు తీసుకువస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓటీటీలోకి పలు సినిమాలు, సిరీస్ రాబోతున్నాయి. ఒక్కరోజే ఎన్ని సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయో తెలుసుకుందామా.

ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న వార్ 2, కూలీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. భారీ బడ్జెట్.. భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రాలు ఇప్పుడు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అలాగే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓటీటీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. యాక్షన్, హారర్, సస్పెన్స్, మిస్టరీ చిత్రాలు ఇప్పుడు జనాల ముందుకు రాబోతున్నాయి. మరీ ఒక్కరోజులోనే ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా..
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..
సారే జహాన్ సే అచ్చా: ప్రతీక్ గాంధీ రూపొందించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఆగస్టు 13న విడుదల కానుంది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ లో ప్రతీక్ గాంధీ, సన్నీ హిందూజా, సుహైల్ నయ్యర్, కృతికా కమ్రా, తిలోత్తమ షోమ్ కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
టెహ్రాన్.. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించిన సిరీస్ పేరు టెహ్రాన్. రాజకీయ కుట్రల నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ ఆగస్ట్ 14న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ కుట్రలలో చిక్కుకున్న భారతీయ పోలీసు అధికారి కథను తెలియజేస్తుంది.
డార్క్‌నెస్ : ఆగస్ట్ 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న సిరీస్ ఇది. అతీంద్రియ సంఘటనలతో ఉన్న ఈ సిరీస్ ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. తప్పిపోయిన అమ్మాయి కోసం ఇన్‌స్పెక్టర్ కల్పనా కదం, వైద్య విద్యార్థి జై ప్రయత్నించడమే ఈ సిరీస్. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటుంది. ఇందులో ప్రజక్తా కోలి, సుర్వీన్ చావ్లా, ప్రియా బాపట్ నటించారు.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
నైట్ ఆల్వేస్ కమ్స్: ఇది అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఆగస్ట్ 15న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తన ఇంటిని కాపాడుకోవడం కోసం ఒక అమ్మాయి చేసే పోరాటమే ఈ సిరీస్. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త జానర్ చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..







