AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: ఏందీ భయ్యా ఇది.. సాయి పల్లవి ఈ సైకో థ్రిల్లర్ మూవీలో నటించిందా..? కానీ..

ఇటీవల కాలంలో సైకో థ్రిల్లర్, మిస్టరీ, హారర్ సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇలాంటి తరహా చిత్రాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి. కానీ మీకు ఈ సినిమా గురించి తెలుసా.. ? సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ చాలా తక్కువ మందిని ఆకర్షించిన సినిమా.

Sai Pallavi: ఏందీ భయ్యా ఇది.. సాయి పల్లవి ఈ సైకో థ్రిల్లర్ మూవీలో నటించిందా..? కానీ..
Athiran Movie
Rajitha Chanti
|

Updated on: Mar 02, 2025 | 6:13 PM

Share

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి చెప్పక్కర్లేదు. గతేడాది అమరన్.. ఈ ఏడాది తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలతో మరోసారి సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోయింది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు విషయానికి వస్తే.. ప్రేక్షకులను అతి తక్కువగా ఆకట్టుకున్న సినిమా ఇది. కథ చాలా శక్తివంతమైనది కానీ సినిమాకు రావాల్సిన ప్రేమ రాలేదు. దక్షిణాది నుండి తక్కువగా అంచనా వేయబడిన ఈ సినిమా ఒక ప్రమాదకరమైన హారర్ థ్రిల్లర్. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కథ 1970లలో కేరళలోని ఒక మారుమూల ప్రాంతంలోని ఒక మానసిక ఆరోగ్య సంస్థలో జరుగుతుంది.డాక్టర్ కె. నాయర్ (ఫహద్ ఫాసిల్) ఒక ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ సంస్థకు వస్తాడు. అతను అక్కడికి వెళ్ళినప్పుడు, అతనికి చాలా వింతైన విషయాలు కనిపిస్తాయి.

అక్కడే నిత్య (సాయి పల్లవి) చీకటి గదిలో బంధించబడి ఉంటుంది. ఆమె ప్రవర్తన వింతగా ఉంటుంది. ఆమె కళ్లు ఎప్పుడూ ప్రకాశిస్తుంటాయి. ఎవరితోనూ మాట్లాడుకుండా మౌనంగా ఉంటుంది. ఆమెను అక్కడ ఎందుకు ఉంచారు? ఆమె మానసిక రోగినా లేక ఆమె గురించి ఏదైనా పెద్ద రహస్యం ఉందా? అనేది సినిమా. కట్ చేస్తే నిత్య బ్యాగ్రౌండ్ మాములుగా ఉండదు. ధనిక కుటుంబానికి చెందిన ఆమెను అక్కడ ఎవరు ఎందుకు బంధించారు అనేది స్టోరీ. ఈ సినిమా అనుక్షణం ఊహించని మిస్టరీలతో, ట్విస్టులతో సాగుతూ ఉంటుంది.

ఈచిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించగా… మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా కనిపించాడు. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అంతగా రెస్పాన్స్ రాలేదు. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసా.. అదే అతిరన్. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..