AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబు.. రొమాంటిక్ సీన్లతో అరాచకం.. తెలుగులోకి వస్తోన్న బోల్డ్ వెబ్ సిరీస్..

ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఎక్కువగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. జనాలు ఎక్కువగా ఇలాంటి జానర్ చిత్రాలను ఇష్టపడుతుండడంతో మేకర్స్ సైతం ఈ తరహా సినిమాలను రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఓ రొమాంటిక్ వెబ్ సిరీస్ అడియన్స్ ముందుకు వస్తుంది.

OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబు.. రొమాంటిక్ సీన్లతో అరాచకం.. తెలుగులోకి వస్తోన్న బోల్డ్ వెబ్ సిరీస్..
Emoji Web Series
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2025 | 7:55 AM

Share

ఓటీటీ ప్లాట్ ఫామ్స్.. ఎలాంటి సెన్సార్ ఇబ్బందులు లేకుండా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు మేకర్స్ కు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. తమ సినిమాలకు సెన్సార్ కట్స్ లేకుండా ఉండాలంటే నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రొమాంటిక్, బోల్డ్ సీన్స్ అత్యధికంగా ఉండే చిత్రాల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో వచ్చిన పలు సినిమాలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు అలాంటి సినిమానే అడియన్స్ ముందుకు వస్తుంది. దాదాపు రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలైన రొమాంటిక్ బోల్డ్ వెబ్ సిరీస్ తెలుగులోకి వస్తుంది. అదే ఎమోజీ.. ఇందులో బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఎక్కువగానే ఉంటాయి. యూత్ ను ఆకట్టుకునేందుకు మేకర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్.. అప్పట్లో నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడీ ఈ వెబ్ సిరీస్ ను అదే పేరుతో తెలుగులోకి తీసుకువస్తున్నారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 28 నుంచి అంటే శుక్రవారం నుంచి ఈ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే నిమిషం నిడివి ఉన్న టీజర్ సైతం రిలీజ్ చేశారు. “లవ్, ఫ్యాషన్, డెస్టినీ.. వాళ్లు మళ్లీ కలుసుకుంటారా. ? ఎమోజీ ఫిబ్రవరి 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ సైతం కాస్త బోల్డ్ గానే ఉంది. ఓ అమ్మాయి, అబ్బాయి సహజీవనం, విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ రూపొందించారు.

ఇవి కూడా చదవండి

ఇందులో తమిళ్ యాక్టర్స్ మహత్ రాఘవేంద్ర, మానస చౌదరి, దేవిక ముఖ్య పాత్రలు పోషించారు. మహత్ రాఘవేంద్ర ఇదివరకే తెలుగులో అనేక చిత్రాల్లో నటించాడు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత లేడీస్ అండ్ జెంటిల్మెన్, సైకిల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..