AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారి డిలీట్ సీన్స్ కూడా..

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ నటించిన లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఇదే కావడం విశేషం. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుుడు ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారి డిలీట్ సీన్స్ కూడా..
Sankranthiki Vasthunam Ott
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2025 | 7:04 AM

Share

ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వ్చచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో వెంకటేశ్ మరో హిట్ అందుకున్నారు. అంతేకాకుండా వెంకీ కెరీర్ లో హయ్యేస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది సంక్రాంతికి వస్తున్నాము. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించగా.. ఇందులో మురళీధర్ గౌడ్, శ్రీనివాస రెడ్డి, మాస్టర్ రేవంత్, సాయి కుమార్ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించగా.. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు సైతం సూపర్ హిట్ అయ్యాయి. సంక్రాంతి కానుకుగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్ రీజనల్ చిత్రాల్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చింది.

ఈ ఏడాది జనవరి 14న విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు 45 రోజుల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మార్చి 1 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. థియేటర్లలో నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను తొలగించారట డైరెక్టర్ అనిల్ రావిపూడి. అయితే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ కోసం ఆ సీన్స్ అన్నింటినీ తిరిగి యాడ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ ను యాడ్ చేయనున్నారు. అలాగే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ మధ్య కూడా మరికొన్ని సీన్స్ ఉన్నాయట. ఈ విషయం పై టీమ్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. అటు టీవీల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రసారం కానుంది. అటు టీవీల్లో. ఇటు ఓటీటీలో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..