AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thandel OTT: నాగచైతన్య తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ తండేల్. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. చైతూ కెరీర్ లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే.

Thandel OTT: నాగచైతన్య తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
Thandel Movie
Rajitha Chanti
|

Updated on: Mar 02, 2025 | 4:55 PM

Share

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది తండేల్. అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ తిరగరాసింది. మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ చేరుకుంది. చైతూ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం. మత్య్సకారుల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా రియల్ స్టోరీకి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా చైతూ, సాయి పల్లవి కెమిస్ట్రీ, యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. చైతూ యాక్టింగ్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా తండేల్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్.. మార్చి 7 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. అలాగే తండేల్ పోస్టర్ సైతం రిలీజ్ చేసింది. దీంతో ఇప్పుడు చైతూ, సాయి పల్లవి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కథ విషయానికి వస్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లతో గుజరాత్ వెరావల్ నుంచి బయలదేరి చేపల వేట సాగిస్తుండగా.. పొరపాటున పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి వెళ్తారు. దీంతో వారిని పాక్ అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. అదే తండేల్ కథ. మత్య్సకారులను పాక్ ఎలా విడుదల చేసింది.. ? రాజు, సత్య ప్రేమకథ గురించి తెలుసుకోవాలంటే తండేల్ చూడాల్సిందే.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

రోజుకు 4 గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా? మీ బాడీలో అద్భుతం చూస్తార
రోజుకు 4 గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా? మీ బాడీలో అద్భుతం చూస్తార
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!