Vidaamuyarchi: ఓటీటీలోకి వచ్చేసిన అజిత్ విడాముయార్చి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..
హిట్టు, ప్లాపులతో అసలు ఎలాంటి సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కోలీవుడ్ హీరో అజిత్. నటనకు ప్రాధాన్యత.. కంటెంట్ బలంగా ఉండే చిత్రాలను ఎంచుకుంటున్నారు. ఓవైపు చేతినిండా ప్రాజెక్ట్స్, మరోవైపు కార్ రేసింగ్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఇటీవలే విడాముయార్చి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మూవీస్ కోసం ఇటు తెలుగు ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొన్నాళ్లుగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఈహీరో. గతేడాది తెగింపు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన అజిత్.. ఇటీవలే విడాముయార్చి సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంలో హీరోయిన్ త్రిష మరోసారి అజిత్ సరసన జత కట్టింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎంతవాడు గానీ సినిమా సూపర్ హిట్ కాగా.. చాలా కాలం తర్వాత ఈ హిట్ కాంబో రిపీట్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో కన్నడ హీరో అర్జున్ విలన్ పాత్రలో కనిపించగా.. హీరోయిన్ రెజీనా కీలకపాత్ర పోషించింది. తమిళంలో విడాముయార్చి పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో పట్టుదల పేరుతో రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రానికి తమిళంలో సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. కానీ తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది.
బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకుండానే నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీలో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.
రోడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. కంటెంట్ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కానీ అజిత్ హీరో కావడంతో తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక కథ విషయానికి వస్తే.. అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) భార్యభర్తలు. అజర్ బైజాన్ లో ఉండే వీరిద్దరు మనస్పర్థలతో విడాకులు తీసుకోవాలని అనుకుంటారు. అయితే విడిపోవడానికి ముందు రోడ్ ట్రిప్ వెళ్దామని అర్జున్ అడగడంతో కాయల్ ఒకే అంటుంది. అప్పుడే కాయల్ ను కొందరు కిడ్నాప్ చేస్తారు. కాయల్ ను ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు..? ఆమెను అర్జున్ ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా.
#VidaaMuyarchi ' Is Now Officially Streaming On NETFLIX#VidaaMuyarchi #Thala #AjithKumar pic.twitter.com/o2hSdp05nh
— Balaji (@_balajihere) March 3, 2025
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..








