OTT: జితేందర్‌రెడ్డిని నక్సలైట్లు ఎందుకు చంపారు? ఓటీటీలో జగిత్యాల టైగర్ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన ఆర్ఎస్ఎస్ లీడర్ జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం జితేందర్ రెడ్డి. వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ బయోపిక్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

బాహుబలి ఫేమ్ రాకేశ్ వర్రే ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జితేందర్ రెడ్డి. జగిత్యాల ప్రాంతానికి చెందిన ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర విరించి వర్మ. వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, రవిప్రకాష్, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రలు వహించారు. గతేడాది నవంబర్ 8 న థియేటర్లలో విడుదలైన జితేందర్ రెడ్డి ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడి జీవిత కథ కావడంతో ఇక్కడి ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. అయితే పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో లాంగ్ రన్ కొనసాగించడంలో జితేందర్ రెడ్డి మూవీ విఫలమైంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ బయోపిక్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. జితేందర్ రెడ్డి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. ఈనెల 20 నుంచి జితేందర్ రెడ్డి సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి జితేందర్ రెడ్డి సినిమాను నిర్మించారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక జితేందర్ రెడ్డి సినిమా కథ విషయానికి వస్తే.. జగిత్యాల టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న జితేందర్‌రెడ్డిని నక్సలైట్లు ఎందుకు చంపారు? 1980-90 దశకంలో తెలంగాణ లో నెలకొన్న సామాజిక అసమానతలపై ఆయన ఎలాంటి పోరాటం చేశాడు? నక్సలైట్లకు ఎందుకు టార్గెట్ గా మారాడు? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు. అలాగే ఎన్టీఆర్, వాజ్‌పేయి లాంటి నాయకులు తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా ఈ మూవీలో ప్రస్తావించారు.
March is Packed with Blockbusters! 🍿🔥
Get ready for an exciting lineup of films this month on @ETVWin! 🎉 From heartwarming dramas 💖 to action thrillers 🔥, there’s something for everyone!#MarchReleasesOnEtvWin#EtvWin pic.twitter.com/tRxWuxXNSW
— ETV Win (@etvwin) March 1, 2025
మరి ఈ పొలిటికల్ బయోపిక్ ను థియేటర్లలో మిస్ అయ్యారా? అయితే మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.
ఈటీవీ విన్ లో ఇవి కూడా..
🎬✨ A Story of Love, Change & Emotions! 💖🔥#KousalyaSuprajaRama is now streaming on @ETVWin ! 🌟 Witness a heartwarming journey filled with love ❤️, laughter 😄, and life-changing moments 💫. Don’t miss this cinematic delight! 🎭🎥
📺 Watch Now 👉 https://t.co/HBfKdgTlVR… pic.twitter.com/mnwXmCrxHO
— ETV Win (@etvwin) February 28, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .








