OTT Movie: స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు.. 5 కోట్లతో తీస్తే 80 కోట్లకు పైగా కలెక్షన్లు.. ఓటీటీలో బ్లాక్ బస్టర్
కొన్నిరోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ దెయ్యం సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేనప్పటికీ భారీ వసూళ్లు రాబట్టింది. రికార్డు కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తద్వారా సినిమాల్లో కంటెంటే కింగ్ అని మరోసారి ఈ మూవీ నిరూపించింది.

స్టార్ హీరో, హీరోయిన్స్ లేరు.. వీఎఫ్‌ఎక్స్, స్పెషల్ సాంగులు, యాక్షన్ సీక్వెన్సులు గట్రా కూడా ఏమీ లేవు. పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అయితేనేం కంటెంట్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిందీ సినిమా. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లను రాబడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ఏ వెబ్ సైట్ చూసినా ఈ మూవీ వార్తలే కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోన్న నేటి పరిస్థితుల్లో కంటెంటే కింగ్ అని మరోసారి నిరూపించిన ఆ సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వీరి కోరిక నెరవేరనుంది. ఈ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మరికొన్నిరోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీదకు రానుంది. ఇంతకు ఆ సినిమా ఏదనుకుంటున్నారా? కన్నడ లేటస్ట్ కామెడీ హారర్ మూవీ సు ఫ్రమ్ సో.
జూలై 25 న కన్నడలో థియేటర్లలో రిలీజ్ అయిన సు ఫ్రమ్ సో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. దర్శకుడు రాజ్ బి శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలక పాత్రలో మెరిశాడు. ఇటీవలే తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కాగా ఇక్కడ కూడా ఓ మోస్తరు వసూళ్లు రాబడుతోంది.
ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లు..
ఇప్పటికీ థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబడుతోన్న సు ఫ్రమ్ సో సినిమా ఓటీటీ రిలీజ్ గురించి నెట్టింట ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు డీల్ కుదుర్చుకుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారని సమాచారం. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.
ಧನ್ಯವಾದಗಳು ❤️ നന്ദി ❤️ ధన్యవాదాలు ❤️ From Karnataka to Kerala to Telugu states, Your love has made #SufromSo a nationwide celebration. 🚗✨ pic.twitter.com/ATt2AEnRPK
— lighterbuddha films (@lighterbuddha) August 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








