ATM Web Series: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ వెబ్ సిరీస్.. ఏటీఎం స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
డబ్బు కట్టలతో ఉన్న ఓ బ్యాగును తీసుకెళుతుండగా, జారిపడడంతో ఆ నోట్ల కట్టలను మళ్లీ బ్యాగులో వేసుకుని సన్నీ తన కారులో వెళ్లిపోయాడు. ఇది ఓ అపార్ట్‌మెంట్ దగ్గర కెమెరాల్లో రికార్డైన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా కూడా మారింది. అయితే ఇదంతా తన రాబోయే ప్రాజెక్టు ప్రమోషన్స్‌లో భాగమేనని చాలామంది అభిప్రాయపడ్డారు. చివరకు వారు అనుకున్నదే నిజమైంది.
బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో వీజే సన్నీ ఒకరు. బిగ్ బాస్ సీజన్ సీజన్ 5లో రెండో కంటెస్టెంట్‌గా హౌస్లోకి అడుగుపెట్టిన సన్నీ ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. అంతకుముందు పలు సీరియల్స్, టీవీ షోల్లో పాల్గొన్నా పెద్దగా గుర్తింపు తెచ్చుకోని సన్నీ బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. టైటిల్ తీసుకుని హౌస్ నుంచి బయటికొచ్చాక వచ్చాక కూడా వార్తల్లో నిలిచాడు. బిగ్‌బాస్ వల్ల తన కెరీర్‌కు ఒదిగేందేమి లేదని ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇందుకు భిన్నంగా బిగ్ బాస్ సీజన్ 6కు గెస్టుగా వచ్చినప్పుడు మాత్రం షోను ఆకాశానికెత్తేశాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. సకలగుణాభిరామ సినిమాతో మొదటిసారి హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఇటీవల దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు సన్నీ. డబ్బు కట్టలతో ఉన్న ఓ బ్యాగును తీసుకెళుతుండగా, జారిపడడంతో ఆ నోట్ల కట్టలను మళ్లీ బ్యాగులో వేసుకుని సన్నీ తన కారులో వెళ్లిపోయాడు. ఇది ఓ అపార్ట్‌మెంట్ దగ్గర కెమెరాల్లో రికార్డైన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా కూడా మారింది. అయితే ఇదంతా తన రాబోయే ప్రాజెక్టు ప్రమోషన్స్‌లో భాగమేనని చాలామంది అభిప్రాయపడ్డారు. చివరకు వారు అనుకున్నదే నిజమైంది.
వీజే సన్నీ ఏటీఎమ్.. పైసల్‌తో ఆట అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. సుబ్బరాజు, దివి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సిరీస్‌కు కథ అందించారు. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఏటీఎమ్: పైసల్‌తో ఆట వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. జనవరి 20 నుంచి తెలుగు, తమిళ్ భాషల్లో జీ5లో ప్రసారం కానుందని ప్రకటించింది చిత్రయూనిట్. దీంతో సన్నీ ప్రస్తుతం డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో అన్ స్టాపబుల్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
A heist that will make you relook at your way of life & startle you to your very core.#ATMOnZee5 – The game of money, #PaisalThoAata, STARTS SOON@VJSunnyOfficial @actorsubbaraju @RoielShree @ravirajdance @KrishnaBurugula @DiviActor@harish2you @chandramohan_c @DilRajuProdctns pic.twitter.com/rKkoheUOQ2
— ZEE5 Telugu (@ZEE5Telugu) January 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..