AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఆ విషయంలో గోపిచంద్ వెనక ప్రభాస్ ఉన్నాడట.. తన స్నేహితుడికి డార్లింగ్ ఇచ్చిన సలహా ఏంటంటే..

ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు.. రాజకీయ ప్రముఖులు విచ్చేసిన నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 షోలోకి ప్రభాస్..గోపిచంద్ వచ్చి సందడి చేశారు. ఎప్పుడూ ఇంటర్వ్యూలలో సైలెంట్ గా ఉండే డార్లింగ్.. మొదటిసారి ఈ వేదికపై తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఎంతో సరదాగా ఉన్నారు. చాలా కాలం తర్వాత తమ హీరోను అంత సంతోషంగా చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.

Prabhas: ఆ విషయంలో గోపిచంద్ వెనక ప్రభాస్ ఉన్నాడట.. తన స్నేహితుడికి డార్లింగ్ ఇచ్చిన సలహా ఏంటంటే..
Gopichand, Prabhas
Rajitha Chanti
|

Updated on: Jan 07, 2023 | 8:02 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తన ప్రాణ స్నేహితుడు హీరో గోపిచంద్‏తో కలిసి మొదటి ఓటీటీ ప్లాట్ ఫాంపై సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు.. రాజకీయ ప్రముఖులు విచ్చేసిన ఈ షోలోకి ప్రభాస్..గోపిచంద్ వచ్చి సందడి చేశారు. ఎప్పుడూ ఇంటర్వ్యూలలో సైలెంట్ గా ఉండే డార్లింగ్.. మొదటిసారి ఈ వేదికపై తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఎంతో సరదాగా ఉన్నారు. చాలా కాలం తర్వాత తమ హీరోను అంత సంతోషంగా చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇక వీరికి సంబంధించిన వీడియోస్ ను రెండు ఎపిసోడ్స్ గా రిలీజ్ చేసింది ఆహా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఇందులో గోపిచంద్, ప్రభాస్ మధ్య ఉన్న అనుబంధం.. వారిద్దరి స్నేహం ఎలా ఉంటుందనేది తెలుస్తోంది. అయితే తనకు గతంలో ప్రభాస్ ఇచ్చిన సలహాల గురించి చెప్పుకొచ్చాడు గోపిచంద్.

ఈ ఎపిసోడ్ లో బాలయ్య మాట్లాడుతూ.. తనకు గోపిచంద్ నటించిన జిల్ సినిమా చాలా నచ్చిందని.. ఇప్పటివరకు తాను మూడుసార్లు చూశానని చెప్పుకొచ్చారు. అందులో హీరో ట్రెండీ మేకోవర్ తనకు బాగా నచ్చిందని చెప్పారు బాలయ్య. అయితే తన రూపాంతరం వెనక ప్రభాస్ ఉన్నాడని అసలు విషయం బయటపెట్టారు గోపిచంద్.

ఇవి కూడా చదవండి

జిల్ సినిమా.. తన మేకోవర్ విషయంలో పూర్తి క్రెడిట్ డార్లింగ్ దే అని గోపిచంద్ వెల్లడించారు. రొటీన్ లుక్స్ తో తనను చూసి గెటప్ మార్చుకోమని సలహా ఇచ్చాడట. జిల్ సినిమాలో గోపిచంద్ ఫ్యాన్సీగా, స్టైలీష్ గా కనిపించారని.. అలాగే మెయింటెయిన్ చేయమని బాలకృష్ణ కోరారు. డిఫరెంట్ గా జిల్ సినిమా చేయమని ప్రభాస్ చెప్పాడని గోపిచంద్ తెలిపారు. అలాగే ఈ ఎపిసోడ్ లో తన పెద్దనాన్న కృష్ణంరాజును తలుచుకుని ఎమోషనల్ అయ్యారు ప్రభాస్.

Follow Us
హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్లపై కేంద్రం బిగ్ అప్డేట్..
హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్లపై కేంద్రం బిగ్ అప్డేట్..
గుండెకు హత్తుకునే సాహిత్యం.. భోగి నుంచి నయా ఫోక్ బ్లాక్‌బస్టర్..!
గుండెకు హత్తుకునే సాహిత్యం.. భోగి నుంచి నయా ఫోక్ బ్లాక్‌బస్టర్..!
ఒక్క మ్యాచ్‌లోనే మూడు రికార్డులను తిరగరాసేసిన టీమిండియా
ఒక్క మ్యాచ్‌లోనే మూడు రికార్డులను తిరగరాసేసిన టీమిండియా
10 నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏమవుతుంది? అద్భుతమైన ప్రయోజనాలు!
10 నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏమవుతుంది? అద్భుతమైన ప్రయోజనాలు!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ చనిపోతే అకౌంట్లోని సొమ్ము ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ చనిపోతే అకౌంట్లోని సొమ్ము ఎవరికి..?
భారత్ ఓటమికి కారణాలివేనా?
భారత్ ఓటమికి కారణాలివేనా?
కెప్టెన్‏గా సుధీర్.. ఝాన్సీ నిర్ణయంతో అగ్ని పరీక్షకు టీంకు షాక్..
కెప్టెన్‏గా సుధీర్.. ఝాన్సీ నిర్ణయంతో అగ్ని పరీక్షకు టీంకు షాక్..
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..