aha: సంక్రాంతి నుంచి ఉగాది వరకు అదిరిపోయే కంటెంట్ రెడీ చేసిన ఆహా.. ఇదిగో లిస్ట్..

పండుగ సీజన్స్‌లో ఆడియెన్స్ కోసం మాంచి కంటెంట్ రెడీ చేసింది ఆహా టీమ్. ఎంజాయ్.. పండగో అంటూ సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ విడుదల చేసింది.

aha: సంక్రాంతి నుంచి ఉగాది వరకు అదిరిపోయే కంటెంట్ రెడీ చేసిన ఆహా.. ఇదిగో లిస్ట్..
Aha OTT
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 06, 2023 | 4:39 PM

అచ్చ తెలుగు ఓటీటీ ఆహా ఆడియెన్స్‌కు పిచ్చ ఫన్‌ ఇచ్చేందకు రెడీ అయిపోయింది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు.. అదిరిపోయే కంటెంట్ రెడీ చేసింది. ఇప్పటికే అన్‌స్టాపబుల్, కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్, తమాషా షోలతో అలరిస్తున్న ఆహా.. సినిమాలు, వెబ్ సిరీస్‌లను బ్యాక్ టూ బ్యాక్ రెడీ చేసింది. తాజాగా ఆ వివరాలను అందజేసి.. మూవీ లవర్స్‌ను థ్రిల్ చేసింది. అయితే విడుదల తేదీలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వన్ బై వన్ ఆహా సోషల్ మీడియా వేదికగా డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది

సినిమాలు

  1. సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రలో  మైఖేల్‌ సినిమా
  2. యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం ప్రధాన పాత్రలో వినరో భాగ్యము విష్ణు కథ
  3. సంతోశ్‌ శోభన్‌ హీరోగా కల్యాణం కమనీయం మూవీ

ఆహా ఒరిజినల్స్/ వెచ్ సిరీస్‌లు

  1. సత్తిగాని రెండెకరాలు
  2. న్యూసెన్స్‌
  3. పాపం పసివాడు
  4. ఇంటింటి రామాయణం
  5. బాలుగాని టాకీస్‌
  6. బీఎఫ్‌ఎఫ్‌ 2
  7. గీతా సుబ్రహ్మణం 3

అంతేకాదు కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘స్కూల్’.. జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు ఆహా అనౌన్స్ చేసింది. అంతేకాదు ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ఉచితంగా చూడొచ్చని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..