OTT Movie: అనసూయ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడొచ్చంటే..

అలాగే ఈ చిత్రానికి సంపత్ నంది కథ, మాటలు అందించారు. ఈ మూవీలో వశిష్ట సింహా, దివి, శ్రీనాథ్ మాగంటి కీలకపాత్రలు పోషించగా.. పర్యావరణాన్ని పరిరక్షించాలనే విషయానికి థ్రిల్లింగ్ అంశాలను జోడించారు సంపత్ నంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ రొటీన్ స్టోరీ కావడంతోపాటు..

OTT Movie: అనసూయ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడొచ్చంటే..
Simbaa Movie
Follow us

|

Updated on: Sep 04, 2024 | 5:25 PM

టాలీవుడ్ నటి అనసూయ, విలక్షణ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలలో నటించిన సినిమా సింబా. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అరంగేట్రం చేశాడు మురళీ మనోహర్. అలాగే ఈ చిత్రానికి సంపత్ నంది కథ, మాటలు అందించారు. ఈ మూవీలో వశిష్ట సింహా, దివి, శ్రీనాథ్ మాగంటి కీలకపాత్రలు పోషించగా.. పర్యావరణాన్ని పరిరక్షించాలనే విషయానికి థ్రిల్లింగ్ అంశాలను జోడించారు సంపత్ నంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ రొటీన్ స్టోరీ కావడంతోపాటు.. అనుకున్నంత ఉండకపోవడంతో ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కానీ ఎప్పటిలాగే అనసూయ, జగపతి బాబు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఇన్నాళ్లు థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్స్ గౌతమి, కస్తూరి కీలకపాత్రలలో నటించగా.. జగపతి బాబు గెస్ట్ రోల్ చేశారు. దీంతో ముందు నుంచి ఈ సినిమాలో జగపతి బాబు హీరో అనుకున్న అడియన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. డైరెక్షన్, స్టోరీ పరంగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ చిత్రానికి కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించాడు.

కథ విషయానికి వస్తే..

ఇవి కూడా చదవండి

అక్షిక (అనసూయ) ఓ స్కూల్ టీచర్. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని హత్య చేస్తుంది. అలాగే జర్నలిస్ట్ ఫాజిల్ (శ్రీనాథ్), అతడి ప్రియురాలు ఇష్ట (దివి) కూడా ఓ హత్యకు పాల్పడుతారు. చనిపోతున్న వ్యక్తులు బిజినెస్ మెన్ పార్థకు సంబంధించినవారు కావడంతో ఈ కేసు మిస్టరీగా మారుతుంది. చివరకు అతడి తమ్ముడు కూడా హత్యకు గురవుతాడు. అయితే వీరిని అక్షిక, ఫాజిల్, ఇష్ట ఎందుకు చంపారు..? ఈ హత్యలకు పురుషోత్తమ్ రెడ్డికి (జగపతి బాబు)కు సంబంధం ఏంటీ ? అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం