Pushpa 2 OTT: అల్లు అర్జున్ పుష్ప 2 స్ట్రీమింగ్‌కు వచ్చేది ఆ ఓటీటీలోనే.. డీల్ ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బుధవారం (డిసెంబర్ 04) నుంచే చాలా చోట్ల బెనిఫిట్ షోస్ పడగా, గురువారం (డిసెంబర్ 05) సుమారు 12వేలకు పైగా స్క్రీన్లలో పుష్ప రాజ్ అడుగు పెట్టాడు.

Pushpa 2 OTT: అల్లు అర్జున్ పుష్ప 2 స్ట్రీమింగ్‌కు వచ్చేది ఆ ఓటీటీలోనే.. డీల్ ఎన్ని కోట్లంటే?
అసలు పుష్ప 2లో ఏం చూపించారు..? పార్ట్ 3 కోసం ఏమేం దాచేసారు..? రైజ్, రూల్ తర్వాత.. ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది..? అవన్నీ కాదండీ.. పార్ట్ 3 ఎప్పుడు ఉండబోతుంది..?
Follow us
Basha Shek

|

Updated on: Dec 05, 2024 | 11:49 AM

ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 ఫీవర్ నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గురువారం (డిసెంబర్ 05) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ సినిమా రావడం, అందులోనూ క్రేజీ సీక్వెల్ కావడంతో ఆడియెన్స్ పుష్ప 2 థియేటర్లల పోటెత్తుతున్నారు. ఇక ప్రతి చోటా బన్నీ సినిమాకు బ్లాక బస్టర్ టాక్ వస్తోంది. రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీ అని సినిమా చూసిన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ కూడా ఫిక్స్ అయ్యింది. దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు పుష్ప 2 స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం పుష్ప 2 మేకర్స్ కు సుమారు రూ. 250 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే పుష్ప 2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి కాస్త ఆలస్యంగానే ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. సంక్రాంతి తర్వాతే పుష్ప 2 సినిమా స్ట్రీమింగ్ ఉండవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా డిసెంబర్ 4న ‘సంధ్య 70ఎంఎం’ థియేటర్‌లో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా చూశారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో థియేటర్ కు వచ్చిన బన్నీ అభిమానులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.అల్లు అర్జున్‌తో పాటు రష్మిక, ఫహద్ ఫాసిల్, తారక్ పొన్నప్ప సునీల్, అనసూయ తదితరులు ఈ సినిమాలో నటించారు

నెట్ ఫ్లిక్స్ కు పుష్ప 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.