Amaran OTT: ఓటీటీలోకి వచ్చేసిన 300 కోట్ల సినిమా..శివ కార్తికేయన్, సాయి పల్లవిల అమరన్ ఎక్కడ చూడొచ్చంటే?

కోలీవుడ్ స్టార్ హీరో, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది.

Amaran OTT: ఓటీటీలోకి వచ్చేసిన 300 కోట్ల సినిమా..శివ కార్తికేయన్, సాయి పల్లవిల అమరన్ ఎక్కడ చూడొచ్చంటే?
Amaran Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 05, 2024 | 10:31 AM

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీలో పనిచేస్తూ అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్‌కుమార్ పెరియస్వామి ఈ సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్‌ బ్యానర్ తో కలిసి ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు నెల రోజుల పాటు థియేటర్లలో రన్ అయ్యి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. శివకార్తికేయన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ అదరగొట్టిన అమరన్ సుమారు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అమరన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 05 నుంచే శివ కార్తికేయన్, సాయి పల్లవిల సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచే అమరన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

అమరన్ సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతంగా నటించాడు. ఈ పాత్ర కోసం తన లుక్ ను కూడా పూర్తిగా మార్చుకున్నాడీ స్టార్ హీరో. ఇక వరదరాజన్ భార్య ఇందూ రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. వీరితో పాటు రాహుల్ బోస్, భువన్ అరోరా, శ్యామ్ ప్రసాద్ వంటి ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించి మెప్పించారు. మరి థియేటర్లలో అమరన్ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

అమరన్ సినిమాలో శివ కార్తికేయన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.