AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mechanic Rocky OTT: ఓటీటీలోకి విశ్వక్ సేన్ లేటెస్ట్ సూపర్ హిట్ మెకానిక్ రాకీ.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో విశ్వక్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. విశ్వక్ సేన్ ఈ సినిమాలో మెకానిక్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని టాక్

Mechanic Rocky OTT: ఓటీటీలోకి విశ్వక్ సేన్ లేటెస్ట్ సూపర్ హిట్ మెకానిక్ రాకీ.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?
Mechanic Rocky
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2024 | 9:56 AM

Share

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ. యాక్షన్ హీరోగా విశ్వక్ సేన్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. చేసిన సినిమాలతో డీసెంట్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఈ నగరానికి ఏమైంది సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన విశ్వక్ సేన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. ఇక రీసెంట్ గా మెకానిక్ రాకీగా అలరించాడు. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు.

ఇద్దరు మెగాహీరోలతో సినిమాలు చేసింది.. ఇప్పుడు ఛాన్స్‌లు లేక ఇలా..

22 నవంబర్ న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు డీసెంట్ వసూళ్లను కూడా రాబట్టింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరక్కేక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ తమ నటనతో పాటు అందంతోను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. థియేటర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకున్న మెకానిక్ రాకీ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందని టాక్.

అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ప్రముఖ ఓటీటీ సంస్థ మెకానిక్ రాకీ సినిమాను ఫాన్స్ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. మెకానిక్ రాకీ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌ దక్కించుకుందని సమాచారం. అయితే ఈ మూవీ నెలరోజుల్లోపే స్ట్రీమింగ్ వచ్చేస్తుందని సమాచారం. డిసెంబ‌ర్ 19 న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. థియేటర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకున్న మెకానిక్ రాకీ ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత విశ్వక్ వరుసగా సినిమాలను లైనప్ చేశాడు. త్వరలోనే లైలా అనే సినిమాతో రానున్నాడు విశ్వక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..