Aha OTT: ఆహా ఓటీటీలో హై ఎనర్జీ డ్యాన్స్ రియాల్టీ షో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. థియేటర్లలో సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ అడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. అలాగే టాక్ షోస్, రియాల్టీ షోల ద్వారా అలరిస్తున్న ఆహా.. ఇప్పుడు సరికొత్త హై ఎనర్జీ డ్యాన్స్ రియాల్టీ షోను తీసుకురాబోతుంది.

Aha OTT: ఆహా ఓటీటీలో హై ఎనర్జీ డ్యాన్స్ రియాల్టీ షో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
High Energy Dance Reality S
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 03, 2025 | 8:15 PM

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీప్రియులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ మూవీస్, వెబ్ సిరీస్ అందిస్తూ డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది. చిన్నారులు, పెద్దలు ఇష్టపడే కంటెంట్ చిత్రాలను అందిస్తుంది ఆహా. అలాగే థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఇతర భాష చిత్రాలను సైతం తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తుంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‏స్టాపబుల్ ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో సినీతారల పర్సనల్ విషయాలు, మూవీస్ అప్డేట్స్ గురించి తెలుసుకుంటున్నారు బాలయ్య. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓటీటీ చరిత్రలో మునుపెన్నడూ లేని సరికొత్త ప్రోగ్రామ్స్ అందిస్తూ డిజిటల్ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తుంది ఆహా.

ఈ క్రమంలోనే తాజాగా మరో షోతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఆహా త్వరలోనే హై ఎనర్జీ డ్యాన్స్ రియాల్టీ షోను స్టార్ట్ చేయబోతుంది. జనవరి 2025లోనే దీనిని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఎంతో ప్రతిభావంతులైన డ్యాన్సర్స్, సెలబ్రెటీస్, అత్యంత ప్రసిద్ధ హోస్ట్ తో ఈ షో ఉండనున్నట్లు తెలిపింది. అటు యాక్టింగ్.. ఇటు కొరియోగ్రఫీలో అనుభవం ఉన్న నటి న్యాయనిర్ణేతగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ డ్యాన్స్ రియాల్టీ షోలో హిప్ హాప్, క్లాసికల్ తోపాటు అన్ని రకాల డ్యాన్సింగ్ ప్రదర్శనలు డ్యాన్సర్స్ ఇవ్వనున్నారని పేర్కొంది.ఈ డ్యాన్స్ రియాల్టీ షోకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనుంది ఆహా.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.