Squid Game 3: రికార్డులు బ్రేక్‌ చేస్తున్న స్క్విడ్‌గేమ్‌2.. అప్పుడే సీజన్ 3 కూడా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

సుమారు మూడేళ్ల క్రితం అంటే 2021లో ఓటీటీలో విడుదలైన స్క్విడ్ గేమ్‌ వెబ్ సిరీస్ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంది. ఓటీటీ రికార్డులు కొల్లగొట్టింది. ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఇటీవలే స్క్విడ్ గేమ్స్ సీజన్ 2 కూడా వచ్చేసి సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా మూడో సీజన్ కు సంబంధించి స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Squid Game 3: రికార్డులు బ్రేక్‌ చేస్తున్న స్క్విడ్‌గేమ్‌2.. అప్పుడే సీజన్ 3 కూడా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Squid Game Season 3
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2025 | 4:12 PM

ఇటీవలే ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. క్రిస్మస్ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సీక్వెల్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి సీజన్ తో పోల్చితే రెండో సీజన్ లో పెద్దగా థ్రిల్లింగ్ అంశాలు లేకపోయినా ఈ సిరీస్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. విజేతగా నిలిచిన హీరో రెబల్ గా మారడం, మళ్లీ తిరిగి ఈ మాయదారి గేమ్ లోకి అడుగుపెట్టడంతో రెండో సీజన్ సాగుతోంది. ఇక చివరి ఎపిసోడ్‌లో ఈ కథ కొనసాగుతుందంటూ స్క్విడ్ గేమ్ సీజన్ 3 పై మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇప్పుడు మూడో సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సీజన్ 2 ముగింపులో మూడవ సీజన్‌కి సంబంధించిన టీజర్ చూపించాడు. ఇంతకుముందు ‘రెడ్ లైట్ గ్రీన్ లైట్’ గేమ్‌లో అమ్మాయి బొమ్మ మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు చూపించిన టీజర్‌లో అబ్బాయి బొమ్మను కూడా చూపించారు. అంటే తదుపరి గేమ్ మరింత రసవత్తరంగా ఉంటుందని ఇది సూచిస్తుంది. ఈ ఏడాదిలోనే స్క్విడ్ గేమ్ మూడో సీజన్ వస్తుందని నెట్టింట టాక్ నడుస్తోంది.

కాగా నెట్‌ఫ్లిక్స్ కూడా ఇదే టీజర్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈసారి ‘జూన్ 27, 2025’ అనే తేదీని కూడా క్యాప్షన్‌లో పెట్టారు.అయితే ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ వీడియోను ప్రైవేట్‌గా చేసి, క్యాప్షన్‌ను మార్చింది. కానీ అప్పటికే కొందరు స్క్రీన్‌షాట్‌లు తీసి నెట్టింట తెగ వైరల్ చేసేస్తున్నారు. ‘స్క్విడ్ గేమ్’ మూడో సీజన్ జూన్ 27న ప్రసారం కానుందని కొందరి అభిప్రాయం. వీక్షకులను ఆకట్టుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ చేసిన వ్యూహమని మరికొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే ‘స్క్విడ్ గేమ్ 3’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ప్లేయర్ 456 రెబల్ గా మారిపోయాడు. మరి హీరో వెతుకుతున్న ఫ్రంట్ మ్యాన్ దొరికాడా?లేదా? అన్నది మూడో సీజన్ లో తేలనుంది.

ఈ ఏడాదిలోనే సీజన్ 3 కూడా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..గుర్తుపట్టారా?
శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..గుర్తుపట్టారా?
రూ.5 లక్షల పెట్టుబడి ద్వారా రూ. 15 లక్షల సంపాదన.. సువర్ణావకాశం!
రూ.5 లక్షల పెట్టుబడి ద్వారా రూ. 15 లక్షల సంపాదన.. సువర్ణావకాశం!
అరటి, బొప్పాయిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
అరటి, బొప్పాయిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ఇదిగో..
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ఇదిగో..
ఒక్క టీ ట్రీ ఆయిల్‌ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చా..
ఒక్క టీ ట్రీ ఆయిల్‌ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చా..
నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
లోయర్‌ బెర్త్‌ కోసం టికెట్‌ బుక్‌ చేస్తున్నారా? రైల్వే నిబంధనలు!
లోయర్‌ బెర్త్‌ కోసం టికెట్‌ బుక్‌ చేస్తున్నారా? రైల్వే నిబంధనలు!
వరుస పరాజయాలతో గంభీర్ ఆగమాగం.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఎఫెక్ట్
వరుస పరాజయాలతో గంభీర్ ఆగమాగం.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఎఫెక్ట్
తస్సాదియ్యా.. ఆ చిన్నారి ఈ అమ్మాయా..? అందాల అరాచకమే..
తస్సాదియ్యా.. ఆ చిన్నారి ఈ అమ్మాయా..? అందాల అరాచకమే..
నాలుకతో 57 తిరిగే ఫ్యాన్స్‌ని ఆపి రికార్డ్ సాధించిన వ్యక్తి..
నాలుకతో 57 తిరిగే ఫ్యాన్స్‌ని ఆపి రికార్డ్ సాధించిన వ్యక్తి..