AHA OTT: ఆహా అందిస్తోన్న వినాయక చవితి కానుక.. పంచతంత్ర కథలు స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Panchatantra Kathalu: తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా (AHA) మరో సరికొత్త సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే పంచతంత్ర కథలు.
Panchatantra Kathalu: తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా (AHA) మరో సరికొత్త సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే పంచతంత్ర కథలు. కేరాఫ్ కంచరపాలెం తరహాలో ఇది ఐదు కథలతో కూడిన ఆంథాలజీ మూవీ. అడకత్తెర, అహల్య, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, నర్తనశాల, అనగనగా అని మొత్తం ఐదు కథలు ఇందులో ఉంటాయి. ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ తల్లి గీత, నోయెల్, నందిని రాయ్, సాయి రోనాక్ ప్రధాన పాత్రల్లో నటించారు. మధు క్రియేషన్స్ బ్యానర్ పై డి మధు ఈ డిఫరెంట్ మూవీని నిర్మించారు. శేఖర్ గంగనమోని దర్శకత్వం వహిస్తున్నారు.
వినాయక చవితి కానుకగా..
అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. వినాయక చవితి కానుకగా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఆగస్టు 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసిన ఆహా యాజమాన్యం సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది. ‘నానమ్మా.. నువ్వు మా ఇంటికి, బాబాయ్ వాళ్లింటికి తిరుగుతున్నావు. నీకు ఇల్లు లేదా?’, ‘నాకు మామూలు మనిషిగా అవ్వాలని ఉంది. కానీ ఈ సమాజం ఒప్పుకొంటుందా?’ అన్న డైలాగులు మనసును హత్తుకునేలా ఉన్నాయి. మరి ఈ కథలను డైరెక్టర్ ఎలా ముడిపెట్టాలో తెలుసుకోవాలంటే ఆగస్టు 31 వరకు ఆగాల్సిందే.