నందు ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీ అప్‏డేట్.. నడికుడి రైలంటి లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన హీరో..

నందు, రష్మీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'బొమ్మ బ్లాక్ బస్టర్'. విజయాభవ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల, బోసుబాసు

  • Rajitha Chanti
  • Publish Date - 1:51 pm, Mon, 25 January 21
నందు 'బొమ్మ బ్లాక్ బస్టర్' మూవీ అప్‏డేట్.. నడికుడి రైలంటి లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన హీరో..

నందు, రష్మీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. విజయాభవ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల, బోసుబాసు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‏కు మంచి స్పందన వచ్చింది. అలాగే మొదటి పాట కూడా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్‏ను ఆదివారం విడుదల చేశారు.

“నడికుడి రైలంటి సోదరా” అంటూ సాగే ఈ పాటను హీరో సుదీర్ బాబు విడుదల చేశారు. దీనికి వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించగా.. ప్రశాంత్ విహారీ బాణీలు అందించారు. ఈ సినిమా టీజర్ చూసినప్పుడే ఇందులో నందు కొత్తగా కనిపించాడు. చాలా ఆసక్తికరంగా ఈ టీజర్ కనిపిస్తోంది. వివేక్ రాసిన లిరిక్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే సింగర్ వైకామ్ విజయలక్ష్మి గారు పాడడం హైలెట్‏గా నిలిచింది అంటూ చెప్పుకొచ్చాడు హీరో సుదీర్. ఇందులో కిరీటి, రఘు కుంచే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.