sushant singh rajput : సుశాంత్ పై సినిమా తీయ్యొద్దు… మా అబ్బాయిని మళ్ళీ మళ్ళీ చంపేస్తున్నారు

గత ఏడాది జూన్ 14.. బాలీవుడ్ యువ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనూహ్యంగా సూసైడ్ చేసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన రోజు.

sushant singh rajput : సుశాంత్ పై సినిమా తీయ్యొద్దు... మా అబ్బాయిని మళ్ళీ మళ్ళీ చంపేస్తున్నారు
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 23, 2021 | 11:46 AM

sushant singh rajput : గత ఏడాది జూన్ 14.. బాలీవుడ్ యువ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనూహ్యంగా సూసైడ్ చేసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన రోజు. టోటల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కదిలించిన బ్యాడ్ న్యూస్ అది. ఆ విషాదం జరిగి దాదాపు ఏడాదవుతోంది. ఈ టైంలో సుశాంత్ పేరు నార్త్ లో మళ్ళీ మోతెక్కిపోతోంది. కారణం..ఆయన జీవిత కథతో ఓ సినిమా రావడం. ది జస్టిస్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న బాలీవుడ్ మూవీ న్యాయ్. మేకింగ్ వ్యాల్యూస్ నాసిరకంగా వున్నా.. కంటెంట్ పరంగా బీ టౌన్ ని షేక్‌ చేస్తోంది న్యాయ్ మూవీ. సుశాంత్ లైఫ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాం అంటూ ఓపెన్ గా చెప్పి తీస్తున్న సినిమా ఇది. ఇప్పుడు దీంతో పాటు.. ఇటువంటి అన్ని సినిమాల మీద యుద్ధం ప్రకటించింది సుశాంత్ ఫ్యామిలీ. మా అబ్బాయిని మళ్ళీ మళ్ళీ చంపేస్తున్నారు అంటూ ఆవేదనతో కోర్టుకెక్కారు సుశాంత్ తండ్రి కేకే సింగ్. ఒకరి పర్సనల్ లైఫ్ లోకి జొరబడి ఇష్టమొచ్చినట్లు తీసే సినిమాల్ని రద్దు చెయ్యమన్నది ఆయన చేసుకున్న అప్పీల్. సుశాంత్ సోదరి ప్రియాంక కూడా.. ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా ద్వారా గొల్లుమంటున్నారు. సుశాంత్ జీవితంపై నేనూ సినిమా చేస్తా అని గతంలో ప్రకటించిన రామ్ గోపాల్ వర్మక్కూడా షాక్ తప్పదేమో మరి!

మరిన్ని ఇక్కడ చదవండి :

Tollywood : టాలీవుడ్‌ను కాటేస్తున్న కరోనా మహమ్మారి… కోవిడ్‌తో తెలుగు ఇండస్ట్రీ ఎన్ని కోట్లు నష్టపోయిందంటే..!

Sarrainodu Movie: అల్లు అర్జున్‌ ‘సరైనోడు’కు ఐదేళ్లు.. రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన మూవీ

Vishnu Vishal, Jwala Gutta : డేటింగ్‌‌కు గుడ్‌బై.. వేదమంత్రాల మధ్య ఒక్కటైన జ్వాల గుత్తా, విష్ణు విశాల్‌