AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : టాలీవుడ్‌ను కాటేస్తున్న కరోనా మహమ్మారి… కోవిడ్‌తో తెలుగు ఇండస్ట్రీ ఎన్ని కోట్లు నష్టపోయిందంటే..!

Telugu Film Industry: కరోనా చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. కరోనా కారణంగా కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని ఇండస్ట్రీలు దారుణంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా...

Tollywood : టాలీవుడ్‌ను కాటేస్తున్న కరోనా మహమ్మారి... కోవిడ్‌తో తెలుగు ఇండస్ట్రీ ఎన్ని కోట్లు నష్టపోయిందంటే..!
Telugu Film Industry
Subhash Goud
|

Updated on: Apr 22, 2021 | 9:22 PM

Share

Telugu Film Industry: కరోనా చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. కరోనా కారణంగా కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని ఇండస్ట్రీలు దారుణంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ అయితే రూ.4 వేల కోట్లు నస్టపోయిందని ఒక అంచనా. తమిళ ఇండస్ట్రీకి దాదాపు రూ వెయ్యి కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక టాలీవుడ్‌ విషయానికొస్తే దాదాపు రూ.1200 కోట్ల వరకు నష్టం వచ్చిందని సీనియర్‌ నిర్మాతలు చెబుతున్న మాట. కేవలం సమ్మర్‌ సీజన్‌లో టాలీవుడ్‌ దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్‌ జరుగుతుందని అంచనా ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా 2020 వేసవి సీజన్‌ మొత్తం సినిమా థియేటర్లు మూతపడటంతో తెలుగు సినీ పరిశ్రమ దారుణంగా నష్టపోయింది. ఇక 2021లోనూ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. సెకండ్‌వేవ్‌ కారణంగా మరోసారి థియేటర్లు మూత పడటంతో చాలా సినిమాలు విడుదల తేదీని ఖరారు చేసుకుని కూడా చివరి నిమిషంలో వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది.

ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు సమ్మర్‌ సీజన్‌ పీక్స్‌లో ఉంటుంది. ఈ సీజన్‌లో చాలా సినిమాలు విడుదల అవుతుంటాయి. ఈ సారి కూడా లవ్‌ స్టోరీ, టాక్‌ జగదీష్‌, విరాట పర్వం, ఆచార్య, ఖిలాడి, అఖండ, రాధేశ్యామ్‌ ఇలా ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా మరోసారి థియేటర్లను మూసివేస్తూ తెలంగాణ థియేటర్ల యాజమాన్యం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో సినిమాలు అన్ని సమయానికి విడుదల అవుతాయనేది చెప్పలేకపోతున్నాయి దర్శక, నిర్మాతలు. ఒక వేళ సినిమా థియేటర్లు తెరుచుకున్నా.. ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ధైర్యం చేసి సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం లేదు.

దీంతో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ధైర్యం చేయడం లేదు. అలాగని థియేటర్లలో తీసుకురావాల్సిన సినిమాలను డిజిటల్లో విడుదల చేయడం సరైన నిర్ణయం కాదంటున్నారు దర్శక, నిర్మాతలు. ఈ లెక్క ప్రకారం దాదాపు రూ.1200 కోట్ల వరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీ నష్టపోయిందని తెలుస్తోంది. మరి ఈ వైరస్‌ ఇంకా ఎంత కాలం పట్టిపీడిస్తుందే చూడాలి.

ఇవీ కూడా చదవండి: Superstar Mahesh Babu టాలీవుడ్‌లో కరోనా కలకలం… సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు..!

Vishnu Vishal, Jwala Gutta : డేటింగ్‌‌కు గుడ్‌బై.. వేదమంత్రాల మధ్య ఒక్కటైన జ్వాల గుత్తా, విష్ణు విశాల్‌

Sarrainodu Movie: అల్లు అర్జున్‌ ‘సరైనోడు’కు ఐదేళ్లు.. రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన మూవీ