AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Superstar Mahesh Babu టాలీవుడ్‌లో కరోనా కలకలం… సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు..!

Tollywood Corona: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులు, సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. కరోనాతో...

Superstar Mahesh Babu టాలీవుడ్‌లో కరోనా కలకలం... సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు..!
సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్. 
Subhash Goud
|

Updated on: Apr 22, 2021 | 5:06 PM

Share

Tollywood Corona: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులు, సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. కరోనాతో థియేటర్లు సైతం మూతపడ్డాయి. మరో వైపు సినిమా షూటింగ్‌లు సైతం వాయిదా పడ్డాయి. అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా, వారితో సన్నిహితంగా ఉన్న మరి కొందరు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌ టాప్‌ హీరోలలో పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌ రాగా, ఆయన చికిత్స పొందుతున్నారు. మరో వైపు ప్రభాస్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌కు కరోనా రావడంతో ప్రభాస్‌ ఐసోలేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం మహేష్‌ బాబు సర్కారువారి పాట చిత్రంలో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు షూటింగ్‌ను వాయిదా వేశారు మహేష్‌. తాజాగా తన పర్సనల్‌ స్టైలిస్ట్‌ కరోనా బారిన పడటంతో అతనితో పాటు మరి కొందరిలోనూ కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో సినిమా షూటింగ్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ముందు జాగ్రత్తగా మహేష్‌ బాబు క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలా ఒక్కొక్కరికి సినీ పరిశ్రమలో కరోనా పాజిటివ్‌ రావడంతో ఆందోళన మొదలైంది. పాజిటివ్‌ వచ్చిన వారినితో సన్నిహితంగా ఉన్న వారు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోతున్నారు.

కాగా, ప్రస్తుతం తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సినిమా షూటింగ్‌లు కొనసాగుతున్నాయి. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం షూటింగ్‌లు వాయిదా పడుతున్నాయి.

ఇవీ చదవండి: మన జీవన విధానాలను మార్చుకోవాలని ఈ కరోనా మనకు సూచిస్తోంది.. నాగార్జున హీరోయిన్..

న్యూయార్క్ పయనమైన షారుఖ్ కుటుంబం.. కరోనా నుంచి తప్పించుకునేందుకేనా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..