భార్గవ్ అమ్మాయిలను గౌరవించడు.. అతనో వుమెనైజర్.. షాకింగ్ విషయాలు చెప్పిన మరో అమ్మాయి..

Fun Bucket  Bhargav: మైనర్ బాలికపై ఆత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఫన్ బకెట్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో

భార్గవ్ అమ్మాయిలను గౌరవించడు.. అతనో వుమెనైజర్.. షాకింగ్ విషయాలు చెప్పిన మరో అమ్మాయి..
Funbucket Bargav Case
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 22, 2021 | 4:16 PM

Fun Bucket  Bhargav: మైనర్ బాలికపై ఆత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఫన్ బకెట్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. గత మూడు రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఫన్ బకెట్ భార్గవ్ వివాదంమే నడుస్తోంది. సదరు అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌పై ఈ నెల 16న పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ‘దిశ’, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసుల విచారణలో తేలిన కొన్ని విషయాలు సెన్సేషన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసపెట్టి అతని వీడియోల్లో నటించిన అమ్మాయిలు కెమెరా ముందుకొస్తున్నారు.

ఇప్పటికే భార్గవ్ తో కలిసి వీడియోస్ చేసిన ఓమైగాడ్ నిత్య, అమ్మాయి అబ్బాయి ఫేం మౌనిక ఆ కేసుతో సంబంధం లేదని చెప్పారు. తాజాగా మరో అమ్మాయి సుమయ ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చి భార్గవ్ గురించి సంచలన విషయాలను బయటపెట్టంది. కెమెరా ముందు ఒకలా కనిపించే భార్గవ్.. తెరవెనుక మరోలా ప్రవర్తిస్తాడంటూ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవతుంది. అతనితో పనిచేసిన అమ్మాయిల కారణంగానే భార్గవ్ కు పేరు వచ్చిందని.. కానీ ఆ విషయాన్ని అతను అంగీకరించడని .. అతనో వుమెనైజర్‌ అంటూ షాకింగ్ విషయాలను చెప్పింది. స్టార్టింగ్‌లో భార్గవ్‌తో పని చేస్తుంటే మంచి వాడని అనుకున్నా.. ఆ తర్వాత మెల్లగా అతని గురించి తెలిసి టీమ్ వదిలివెళ్లా అని చెప్పింది సుమయ. తాను చేసేదే కరెక్ట్ అని భార్గవ్ ఫీల్ అయ్యేవాడని, అతను కెమెరా ముందు ఒకలా కెమెరా ఆఫ్ చేశాక మరోలా ఉంటాడని చెప్పుకొచ్చింది. తాను ఏది చేసినా ఏం కాదులే అనే తత్వం అతనిలో ఉంటుందని తెలిపింది. దీంతో భార్గవ్ ఇష్యూ మరింత సీరియస్ అయింది.

Also read: మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..