మన జీవన విధానాలను మార్చుకోవాలని ఈ కరోనా మనకు సూచిస్తోంది.. నాగార్జున హీరోయిన్..

Dia Mirza: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. రోజూకు లక్షల్లో కేసులు నమోదవుతుండగా..

మన జీవన విధానాలను మార్చుకోవాలని ఈ కరోనా మనకు సూచిస్తోంది.. నాగార్జున హీరోయిన్..
Dia Mirza
Follow us

|

Updated on: Apr 22, 2021 | 4:31 PM

Dia Mirza: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. రోజూకు లక్షల్లో కేసులు నమోదవుతుండగా.. వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అటూ పలువురు నటీనటులు కూడా ఈ మహమ్మారి భారిన పడ్డారు. కరోనా వచ్చి మనిషి మనుగడకు హానీ చేసిన భూమికి మాత్రం మంచే చేసింది. అయితే ఏప్రిల్ 22న ఎర్త్ డే. ఈ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా.. ఎర్త్ డే గురించి స్పందించింది.

“ప్రస్తుతం మనం జీవిస్తున్న పద్దతి.. పరిశ్రమ విధానం మార్చవలసి ఉందని కరోనా స్పషం చేసింది. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి.. ప్రకృతి తల్లి శ్రేయస్సుకు తమ వంతు కృషి చేయాల్సి ఉంది. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వలన మనం మన జీవన శైలీని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆధునికంగా ఎదిగిన మనం.. అంతే విధంగా భూమి పై కాలుష్యానికి కారణమవుతున్నామని దీయా అన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం కోసం ముందుగా మనం చేయాల్సిన పని చెట్లను నాటడం. పర్వావరణాన్ని రక్షించుకోవడం. ఈ సంవత్సరం ఎర్త్ డే కు కోరుకోవాల్సిందేంటంటే… కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ జీవన విధానాన్ని మార్చి.. ప్రకృతికిని” కాపాడాలన్నారు.

ఇటీవల దియా అక్కినేని నాగార్జున సరసన వైల్డ్ డాగ్ సినిమాలో నటించింది. హైదరాబాద్ బాంబు దాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also Read: దేశంలో మృత్యుఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం.. ఆర్థికపరంగా అపార నష్టం.. ఏటా 95 బిలియన్ డాలర్ల పైమాటే..!

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

మీకు ఎస్‌బీఐలో రుణాలు ఇప్పిస్తామని ఫోన్‌లు వస్తున్నాయా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త…వెలుగులోకి వస్తున్న మోసాలు