న్యూయార్క్ పయనమైన షారుఖ్ కుటుంబం.. కరోనా నుంచి తప్పించుకునేందుకేనా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

కరోనా సెకండ్ వేవ్ యావత్ ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. సామాన్య మానవులనే కాదు... సినీ ప్రముఖులను

న్యూయార్క్ పయనమైన షారుఖ్ కుటుంబం.. కరోనా నుంచి తప్పించుకునేందుకేనా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
Sharukh Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 22, 2021 | 4:21 PM

కరోనా సెకండ్ వేవ్ యావత్ ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. సామాన్య మానవులనే కాదు… సినీ ప్రముఖులను సైతం వణికిస్తోంది. ఇప్పుడిప్పుడె ధైర్యంగా షూటింగ్స్ జరుపుకుంటూ.. విడుదలకు సిద్దమవుతున్న చిత్రాలను ఒక్కసారిగా వాయిదా పడేలా చేసింది. ఈ మహమ్మారి ప్రభావంతో సినిమా చిత్రీకరణలు మధ్యలోనే ఆగిపోతుండగా.. హీరోహీరోయిన్లతోపాటు దర్శక నిర్మాతలు సైతం హోం క్యారెంటైన్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా నియంత్రణకు రాష్ట్రాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక మహారాష్ట్రాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. దీంతో మళ్లీ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలిస్తోంది.

Sharukh Khan Family:  ఇదిలా ఉంటే… బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aaryan Khan ).. భార్య గౌరీ ఖాన్ (Gouri Khan) ఉన్నట్టుండి బుధవారం అర్థరాత్రి ముంబై విమానాశ్రంలో ప్రత్యక్షమయ్యారు. వారిద్దరూ కలిసి న్యూయార్క్ వెళ్ళినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు షారుఖ్ అతని కుటంబసభ్యులను ట్రోల్ చేస్తున్నారు. నిజానికి షారుఖ్, ఆయన కుమార్తె సుహానా ఖాన్ (Suhana Khan) ఇద్దరు ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నారు. ఇక వారిని చూడడానికి షారుఖ్ కుమారుడు, అతని భార్య వెళ్లారు. దీంతో కరోనా మళ్లీ వచ్చిందని.. షారుఖ్ కుటుంబం మొత్తం భయంతో పారిపోతున్నారని ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ సినిమాలతో డబ్బులు సంపాదిస్తారు… కానీ కష్టసమయంలో ఇక్కడ ఉండకుండా పారిపోతారు అని ఒకరు కామెంట్ చేయాగా.. మరోకరు మాల్దీవ్స్ కు వెళ్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో..

Also read: మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

దేశంలో మృత్యుఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం.. ఆర్థికపరంగా అపార నష్టం.. ఏటా 95 బిలియన్ డాలర్ల పైమాటే..!