AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: కీలక నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సినీ కార్మికులకు ఉచితంగా టీకా…

కోవిడ్ 19.. మరోసారి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చెస్తోంది. లక్షల మంది ఈ మహమ్మారికి బలవుతుండగా.. స్మశానాలను సైతం

Megastar Chiranjeevi: కీలక నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సినీ కార్మికులకు ఉచితంగా టీకా...
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2021 | 5:11 PM

Share

కోవిడ్ 19.. మరోసారి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చెస్తోంది. లక్షల మంది ఈ మహమ్మారికి బలవుతుండగా.. స్మశానాలను సైతం హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేంతా పరిస్తితికి చేరుకున్నాం. ఈ వైరస్ వలన ఎన్నో కుటుంబాల్లో చీకట్టు కమ్ముకుంటున్నాయి. అలాగే.. ఎంతోమంది చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. ఇక గతేడాది కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ఉద్యోగాలు చేసేవారితోపాటు రోజూవారీ కూలీల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇక ఈ మహమ్మారి సినీ ఇండస్ట్రీని గట్టిగానే దెబ్బతీసింది. సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో.. సినీ కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి.. ఇంకొందరు సినీ పెద్దలతో కలిసి కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసి.. కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకున్నారు.

మరోవైపు కోవిడ్ టీకా పంపిణి జరుగుతున్నా.. కరోనా కేసుల సంఖ్య అంతకు అంతా పెరుగుతున్నాయి. భారతదేశంలో ఈ టీకా వినియోగం విస్తృతంగా జరుగుతోంది. దశల వారిగా అర్హులైన వారందరికీ టీకాను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం సీసీసీ తరఫున సినీ కార్మికులు అందరికీ ఉచితంగా టీకాలు అందజేస్తామని చిరంజీవి ప్రకటించారు.నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్’ సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. సీసీసీ తరఫున సేకరించిన విరాళాలలో కొంత డబ్బు మిగిలి ఉందని.. ఆ డబ్బుతో సినీ కార్మికులకు టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే చిరంజీవీ ఆ ఏర్పాట్లు చేశారు. అపోలో 24/7 సహకారంతో సినీ కార్మికులతో పాటు సినీ జర్నలిస్టులకు కూడా ఉచితంగా టీకా అందజేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.ఈ గురువారం నుంచి ఓ నెల రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన వారితో పాటు వాళ్ల జీవిత భాగస్వామి కూడా 45 సంవత్సరాలు దాటి ఉంటే ఉచితంగా టీకాను పొందే అవకాశం ఉందని మెగాస్టార్ తెలిపారు. ఇందుకోసం అర్హులైన వారందరూ.. తమ అసోసియేషన్లు లేదా యూనియన్లలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అపోలో ఆస్పత్రిలో తగిన వసతులతో ఈ వ్యాక్సినేషన్ చెస్తారని చెప్పారు. అదే విధంగా మూడు నెలల పాటు అపోలో 24/7 ద్వారా ఉచితంగా డాక్టర్లను సంప్రదించి.. మందులు కూడా రాయితీలో లభించే వెసులుబాటు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ట్వీట్..

Also Read: దేశంలో మృత్యుఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం.. ఆర్థికపరంగా అపార నష్టం.. ఏటా 95 బిలియన్ డాలర్ల పైమాటే..!

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

Follow Us
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..