AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarrainodu Movie: అల్లు అర్జున్‌ ‘సరైనోడు’కు ఐదేళ్లు.. రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన మూవీ

Allu Arjun Sarrainodu: ఐదేళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను 'సరైనోడు' సినిమా. ఈ మూవీ బాక్సాఫీసు దగ్గరేకాదు హిందీ డబ్బిండ్‌ వెర్షన్‌లో...

Sarrainodu Movie: అల్లు అర్జున్‌ 'సరైనోడు'కు ఐదేళ్లు.. రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన మూవీ
Allu Arjun Sarrainodu
Subhash Goud
|

Updated on: Apr 22, 2021 | 6:09 PM

Share

Allu Arjun Sarrainodu: ఐదేళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను ‘సరైనోడు’ సినిమా. ఈ మూవీ బాక్సాఫీసు దగ్గరేకాదు హిందీ డబ్బిండ్‌ వెర్షన్‌లో ఎన్నో రికార్డులను క్రియేట్‌ చేసి సంచలనం సృష్టించింది. 2016 ఏప్రిల్‌ 22న విడుదలైన ఈ సినిమా భారీ మొత్తంలో వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ నెగిటివ్‌ టాక్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సొంతం చేసుకున్న సరైనోడు.. దర్శకుడు బోయపాటి శ్రీను మార్క్‌ డైరెక్షన్‌కు అల్లు అర్జున్‌ యాక్షన్‌ తోడై ఈ సినిమా ఎంతో హిట్‌ సాధించింది. అయితే సరైనోడు మూవీ 2016లో సెకండ్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అయితే 2016లో జనతా గ్యారేజీ తర్వాత సెకండ్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఐదో వార్షికోత్సవం నిర్వహించింది ఆ చిత్ర బృందం. అంతేకాదు సరైనోడు సినిమాకు థమన్‌ అందించిన మ్యూజిక్‌ బ్లాక్‌ బస్టర్‌ కావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఒకేరోజు విడుదల చేశారు. సరైనోడు హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ యూట్యూబ్‌లో 700 మిలియన్‌ వ్యూస్‌ పైగా సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. గోల్డ్‌మైన్‌ కంపెనీ ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ హక్కులను కొనుగోలు చేసి విడుదల చేసింది. ఒక హిందీ డబ్బింగ్‌ సినిమా ఈ రేంజ్‌లో వ్యూస్‌ దక్కించుకోవడం ఒక రికార్డు అని చెప్పాలి.

ఈ మూవీ 2016లో సమ్మర్‌ సూపర్‌ హిట్‌ గా నిలిచి, 115 కేంద్రాల్లో 50 రోజులకుపైగా నడిచింది. బోయపతి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. తమిళ హీరో ఆది పవర్ ఫుల్ విలన్ గా నటించాడు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం సినిమాకు మరో హైలెట్. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రీసెంట్ గా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు భారీ స్పందన లభించింది.

ఇవీ కూడా చదవండి:  Vishnu Vishal, Jwala Gutta : డేటింగ్‌‌కు గుడ్‌బై.. వేదమంత్రాల మధ్య ఒక్కటైన జ్వాల గుత్తా, విష్ణు విశాల్‌

Superstar Mahesh Babu టాలీవుడ్‌లో కరోనా కలకలం… సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు..!

Follow Us
పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి సంచలన స్టేట్‌మెంట్‌!
పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి సంచలన స్టేట్‌మెంట్‌!
కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు: సర్వార్థ సిద్ధి యోగం..
కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు: సర్వార్థ సిద్ధి యోగం..
పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట..
పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట..
కేవలం ఛార్జింగ్ 4 గంటలే..105 కి.మీ మైలేజీ.. ధర ఎంతంటే..!
కేవలం ఛార్జింగ్ 4 గంటలే..105 కి.మీ మైలేజీ.. ధర ఎంతంటే..!
ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
నా జీవితాన్ని మార్చేసింది అతడే.. నా లైఫ్‏లో అలాంటి హీరోను చూడలేదు
నా జీవితాన్ని మార్చేసింది అతడే.. నా లైఫ్‏లో అలాంటి హీరోను చూడలేదు
PF చందాదారులకు అలెర్ట్.. అమల్లోకి వచ్చిన 'ఫారమ్ 121'..
PF చందాదారులకు అలెర్ట్.. అమల్లోకి వచ్చిన 'ఫారమ్ 121'..
ట్రైన్ ఒక కిలోమీటర్ నడవడానికి ఎంత ఖర్చవుతుందో తెల్సా..
ట్రైన్ ఒక కిలోమీటర్ నడవడానికి ఎంత ఖర్చవుతుందో తెల్సా..
ఏసీ బోగీలో ఖాళీ ఉందని ఆమెను తీసుకెళ్లాడు.. కట్ చేస్తే..
ఏసీ బోగీలో ఖాళీ ఉందని ఆమెను తీసుకెళ్లాడు.. కట్ చేస్తే..
శుక్రుడు రోహిణి నక్షత్రంలో సంచారం.. ఈ 4 రాశులకు కోటీశ్వర యోగం
శుక్రుడు రోహిణి నక్షత్రంలో సంచారం.. ఈ 4 రాశులకు కోటీశ్వర యోగం