Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు.. ప్రతీ జిల్లాలోనూ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటుకు శ్రీకారం..

టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ జిల్లాలోనూ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని నిర్ణయించారు.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు.. ప్రతీ జిల్లాలోనూ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటుకు శ్రీకారం..
Follow us
Ravi Kiran

| Edited By: Subhash Goud

Updated on: May 20, 2021 | 8:11 PM

Chiranjeevi Oxygen Banks: ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఆక్సిజన్.. దేశ  వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ కొనసాగుతోంది. అనేక మార్గాల ద్వారా ఆక్సిజన్ తరలింపు నిరంతరం జరుగుతున్నా.. ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు ప్రాణ వాయువు సరైన సమయంలో అందటం లేదు. ఫలితంగా పదుల సంఖ్యలో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సకాలంలో ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోకూడదు అనే ఉద్దేశంతో టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రతీ జిల్లాలోనూ ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌’లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. వచ్చే వారం రోజుల్లో ప్రజలకు ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆక్సిజన్ బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలు, నిర్వహణను హీరో రామ్ చరణ్ చూసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, రక్తం దొరక్కుండా ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసుతో ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ను ప్రారంభించిన సంగతి విదితమే.

ఇవి చదవండి:

పెళ్లి పీటలపై నుంచి వరుడు ప‌రార్‌.. వ‌ధువు చేసిన పనికి అంతా షాక్.! కథలో ఊహించని ట్విస్ట్..

భూమిలో కూరుకుపోయిన చిన్నారి.. కళ్లను మోసం చేస్తున్న చిత్రం.. రహస్యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

 ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.!