Bank Account: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.!

Two Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాలు..

Bank Account: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.!
Banks
Follow us

|

Updated on: May 19, 2021 | 4:58 PM

Two Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాలు మారినప్పుడు గానీ.. లేదా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు గానీ మనం రెండో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సిన పరిస్థిత వస్తుంది. ఇక కొన్నాళ్ల తర్వాత దాన్ని పక్కన పెడతాం. అయితే ఇలా రెండు అకౌంట్లు ఉన్నవారికి పలు నష్టాలు కలిగే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా భారీగా పెనాల్టీలు కూడా పడతాయట.

మాములుగా అకౌంట్లలో మినిమమ్ బ్యాలన్స్ లేకపోతే ఛార్జీలు పడతాయి. అయితే ఇలా ఒకరికే రెండు అకౌంట్లు ఉండటం.. వాటిల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే.. అప్పుడు ఏకంగా డబుల్ పెనాల్టీలు కట్టాల్సి వస్తుందని సమాచారం. అందుకే ఎక్కువగా అకౌంట్లు ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ అకౌంట్లు అవసరం లేకపోతే వెంటనే క్లోజ్ చేయడం మంచిది.

అకౌంట్ క్లోజ్ చేసే ముందుగా మంత్లీ ఈఎంఐ లోన్, సిస్టమ్యాటిక్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్ (సిప్), రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ అకౌంట్) వంటి ఆటోమేటెడ్ డెబిట్స్ ఆ అకౌంట్‌కు లింక్ ఉంటే వాటిని ముందుగానే నిలిపివేయాలి. అంతేకాకుండా వీటికి ఆల్‌టర్నెట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక డీ-లింకింగ్ అకౌంట్ ఫామ్‌లో ఈ వివరాలన్నీ అందించాలి. దీనికి దాదాపు 10 రోజులు పడుతుంది. ఇక ఆ తర్వాతే అకౌంట్ క్లోజ్ అవుతుంది.

మరోవైపు అకౌంట్‌ను ఎందుకు క్లోజ్ చేస్తున్నామో క్లోజర్ ఫార్మ్‌లో తెలిపాలి. అంతేకాకుండా దానిలో ఉన్న డబ్బును ఏ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలో కూడా వేరొక ఫామ్ ద్వారా బ్యాంక్ అధికారులకు తెలియజేయాలి. ఇక చెక్ బుక్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డులు వంటివి కూడా తిరిగి అప్పగించాలి. అటు అకౌంట్‌ను ప్రారంభించిన 14 రోజుల్లోపు అకౌంట్ వద్దనుకుంటే ఎలాంటి చార్జీలు పడవు. రెండు వారాలు మించితే మాత్రం ఛార్జీలు పడతాయి. ఇలా ఎక్కువ ఖాతాలు ఉంటే మోసగాళ్లు బారినపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

చివరిగా ఈ అకౌంట్ ద్వారా మీరు పెన్షన్ పొందుతుంటే మాత్రం మీ సంస్థకు తప్పకుండా కొత్త అకౌంట్ నెంబర్ తెలియజేయండి.. లేకపోతే డబ్బులు తీసుకోవడంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ఎక్కువ అకౌంట్లు ఉంటే వాటి లాగిన్ వివరాలను కూడా అప్పుడప్పుడూ మర్చిపోతుంటాం. కాబట్టి ఒకటే అకౌంట్ మైంటైన్ చేయండి.. పెనాల్టీల, ఇబ్బందులు నుంచి తప్పించుకోండి.

Also Read: 

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ టైమింగ్ మారిందా.? ఇందులో నిజమెంత.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు సింహం దాగి ఉంది.. ఎక్కడ ఉందో గుర్తుపట్టండి చూద్దాం.!

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..