Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోడౌన్ సబ్సిడీ స్కీం- 2021 అంటే ఏమిటీ..! ఇది ఎవరికి లాభం..? ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

godown subsidy scheme - 2021 : భారతదేశం వ్యవసాయ దేశం. దేశంలోఆర్థిక పరిస్థితుల కారణంగా ఆహార ధాన్యాలు నిల్వ చేయలేని

గోడౌన్ సబ్సిడీ స్కీం- 2021 అంటే ఏమిటీ..! ఇది ఎవరికి లాభం..? ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Godown Subsidy Scheme
Follow us
uppula Raju

|

Updated on: May 19, 2021 | 5:49 PM

godown subsidy scheme – 2021 : భారతదేశం వ్యవసాయ దేశం. దేశంలోఆర్థిక పరిస్థితుల కారణంగా ఆహార ధాన్యాలు నిల్వ చేయలేని రైతులు చాలా మంది ఉన్నారు. ఈ కారణంగా రైతులు తమ పంటలను చాలా తక్కువ ధరకు అమ్ముకోవలసి వస్తుంది. లేదంటే ధాన్యం కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం గోడౌన్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఈ పథకం అమలు వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ పథకం కింద ధాన్యాన్ని నిల్వ చేయడానికి స్టోర్ హౌస్ నిర్మిస్తారు.

అయితే ధాన్యం నిల్వ చేయడం కోసం స్టోర్‌ హౌస్‌లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ రుణాలు ఇస్తుంది. స్టోర్ హౌస్ నిర్మాణంతో రైతు తన పంటను చాలా కాలం నిల్వ చేసుకోవచ్చు. అంతేకాక రైతులు పంటను తక్కువ ధరకు అమ్మవలసిన అవసరం లేదు. దీనివల్ల సమీప భవిష్యత్తులో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఈ పథకం కింద రైతులకు రుణాలపై 25 శాతం వరకు రాయితీ లభిస్తుంది. మరోవైపు స్టోర్ హౌస్ నిర్మించిన రైతు గ్రాడ్యుయేట్ లేదా సహకార సంఘంతో సంబంధం కలిగి ఉంటే రైతులు రూ.2 కోట్లకు పైగా రుణం పొందవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి..? గ్రామీణ సంగ్రహ యోజనను పొందడానికి మీరు దాని అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. వెబ్‌సైట్ యొక్క హోమ్‌పేజీని ఓపెన్ చేయాలి. Apply Now పై క్లిక్ చేయాలి. అప్పుడు దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అందులో అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించండి. ఇది కాకుండా కొన్ని ముఖ్యమైన పత్రాలను జతచేయాలి. దీని తరువాత ఫారం సమర్పించాలి.

RELIEF FROM CORONA WORRY: కరోనా సెకెండ్ వేవ్ వర్రీ నుంచి విముక్తి కలిగించే గుడ్ న్యూస్ వచ్చేసింది..!

CM KCR Gandhi Hospital Visit Live: కరోనా బాధితులకు ముఖ్యమంత్రి భరోసా.. గాంధీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ పర్యటన

SBI బ్యాంకు చోరీ కేసు.. నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో మరో ముగ్గురు..