SBI బ్యాంకు చోరీ కేసు.. నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో మరో ముగ్గురు..

Gunjapadugu SBI Bank Robbery : మార్చిలో జరిగిన గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నలుగురు

SBI బ్యాంకు చోరీ కేసు.. నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో మరో ముగ్గురు..
Follow us
uppula Raju

|

Updated on: May 19, 2021 | 5:25 PM

SBI Bank Robbery : మార్చిలో జరిగిన గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో మరో ముగ్గురు దొంగలున్నారు. వీరి వద్ద నుంచి మహారాష్ట్ర పోలీసులు 2.9 కిలోల బంగారం రికవరీ చేశారు. ఇందులో 70 శాతం బంగారం గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకులోనిదే అని గుర్తించారు.

మార్చి 24న అర్దరాత్రి గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకులో చోరీ జరిగింది. కొంతమంది దొంగలు బ్యాంకు వెనుక భాగం నుంచి కిటికీ గ్రిల్స్ తొలగించి గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్ సహాయంతో సేఫ్టీ లాకర్ ను కట్ చేసి సుమారు 6 కిలోల బంగారం, 18 లక్షల నగదు దొంగిలించారు. మరునాడు బ్యాంకు మేనేజర్ ప్రహ్లాద్ పింగ్వ మంథని పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అనంతరం సంఘటనా స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు. నేర విధానాన్ని పరిశీలించిన పోలీసులు ఇది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గ్యాంగ్ పనే అని ప్రాథమికంగా నిర్దారణ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మే 1న పోలీసులు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆదేశ్ శర్మను పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతని దగ్గరినుంచి 20 తులాల బంగారం రికవరీ చేశారు. అనంతరం రిమాండ్‌కి తరలించారు. ఇతడితో పాటు బ్యాంక్ దొంగతనంలో పాల్గొన్న 5 గురు నిందితులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి చంద్రాపుర్ సెంట్రల్ జైల్ కు పంపారు. ఆ తర్వాత మంథని మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మే 10న 5 గురు నిందితులను వర్చువల్ గా హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు.

Prices of essential items : ‘ఏం… తినేనట్టులేదు.. ఏం.. కొనేటట్టులేదు..’ నిత్యావసరాల ధరలు ఆకాశానికి.. విలవిల్లాడిపోతోన్న జనం

Bank Account: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.!

Coronavirus: ఆ తండాలోకి క‌రోనాకు నో ఎంట్రీ బోర్డ్.. వారి అనురిస్తున్న విధానాలు వెరీ గుడ్