Girl Suicide: విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడి వెకిలిచేష్టలు.. వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య
అసోంలో దారుణం జరిగింది కామాంధుడి వేధింపులు తాళలేక ఓ బాలిక అతని ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారుణానికి ఒడిగట్టాడు.
Girl Suicide After Sexual Assault: అసోంలో దారుణం జరిగింది కామాంధుడి వేధింపులు తాళలేక ఓ బాలిక అతని ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారుణానికి ఒడిగట్టాడు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది 14 ఏళ్ల బాలిక. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అసోంలో లాక్‌డౌన్ కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో విద్యా సంవత్సరం వృధా అవుతుందని భావించిన ఓ 14 ఏళ్ల విద్యార్థిని బెంగ్తాల్‌లో ఓ కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ఇంట్లో చదువుకునేందుకు వెళ్లింది. ఏడాది కాలంగా అతని ఇంట్లో ఉంటోంది. అయితే, గత సోమవారం ఆమె అతని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
కాగా, చనిపోయే ముందు తన స్నేహితురాలికి సెల్‌ఫోన్ ద్వారా ఓ మెసేజ్ పంపించింది. ఉపాధ్యాయుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆ మెసేజ్‌లో పేర్కొంది. దీంతో ఆ స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చే సమయానికి ఆ ఉపాధ్యాయుడు, అతని కుటుంబ సభ్యులు బాలిక అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు. సమయానికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసిన బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.