Coronavirus: ఆ తండాలోకి క‌రోనాకు నో ఎంట్రీ బోర్డ్.. వారి అనురిస్తున్న విధానాలు వెరీ గుడ్

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ గ్రామగ్రామాన విస్తరిస్తుండగా, ఈ గ్రామంలో నేటికీ ఒక్క కేసు నమోదు కాలేదు. గ్రామాల్లో సెకండ్‌ వేవ్‌ భయాందోళనలు సృష్టిస్తుంటే ఇక్కడ మాత్రం ఒక్కరికి కూడా పాజిటివ్‌ లేదు.

Coronavirus: ఆ తండాలోకి క‌రోనాకు నో ఎంట్రీ బోర్డ్.. వారి అనురిస్తున్న విధానాలు వెరీ గుడ్
No Coronavirus
Follow us
Ram Naramaneni

|

Updated on: May 19, 2021 | 5:15 PM

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ గ్రామగ్రామాన విస్తరిస్తుండగా, ఈ గ్రామంలో నేటికీ ఒక్క కేసు నమోదు కాలేదు. గ్రామాల్లో సెకండ్‌ వేవ్‌ భయాందోళనలు సృష్టిస్తుంటే ఇక్కడ మాత్రం ఒక్కరికి కూడా పాజిటివ్‌ లేదు. చిన్న ఊరు కావడంతో గ్రామ పంచాయతీ చెప్పినట్లు కొవిడ్‌ నిబంధనలను పక్కాగా పాటిస్తున్నారు ఇక్కడి ప్రజలు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి తండాలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదు. గత ఏడాది మార్చిలో వచ్చిన కరోనా మహమ్మారి ఎంతో మందిని పొట్టనబెట్టుకున్నది. రోజు రోజుకూ కరోనా బారిన పడుతున్న వారిని టీవీల్లో, సెల్‌ఫోన్లలో చూసిన ఈ తండావాసులు మొదట్లోనే అప్రమత్తమయ్యారు. కొత్త నిబంధనలు పెట్టుకోవడంతోపాటు ఆంక్షలను విధించుకుని పక్కాగా అమలు చేశారు. చిన్న పిల్లలు మొదలుకుని ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా ఆచరించారు. దీంతో మొదటి దశ, రెండో దశలోనూ కరోనా మహమ్మారి ఈ గ్రామ పొలిమేరను కూడా తాకలేకపోయింది.

గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం పైనే ఆధారపడుతూ ..పొలం పనులకు వెళ్ళేటప్పుడు మాస్కులు, శానిటేషన్ భౌతిక దూరం పాటిస్తున్నారు. గ్రామంలో కిరాణా దుకాణాలు ఇతర వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు కూడా భౌతిక దూరం పాటిస్తున్నారు. గ్రామంలో శుభకార్యాలు, చావులకు ఎక్కువమంది వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నారు. గ్రామంలోకి ఇతరులను అనుమతించటం లేదు. అంద‌రూ క‌లిసి ఒక మాట అనుకున్నారు. దూరంగా ఉండి దాన్ని అమ‌లు చేస్తున్నారు. క‌రోనా మ‌హమ్మారిని ఊర్లోకి రానివ్వ‌కుండా శ‌భాస్ అనిపించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ తండాను ప్ర‌శంసించాల్సిందే.

Also Read: వాహనదారులకు శుభవార్త.. లాక్‌డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇచ్చిన రాష్ట్ర సర్కార్

 రుయా ఘ‌ట‌న‌పై వివ‌రణ కోరిన జాతీయ మానవహక్కుల సంఘం.. 4 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాల‌ని ఆదేశం