CM KCR Gandhi Hospital Visit: కరోనా బాధితులకు ముఖ్యమంత్రి భరోసా.. గాంధీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ పర్యటన

|

Updated on: May 19, 2021 | 6:31 PM

CM KCR visit Gandhi Hospital Live Updates: హైదారబాద్ న‌గ‌రంలోని గాంధీ ఆస్ప‌త్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సంద‌ర్శించారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. క‌రోనా...

CM KCR Gandhi Hospital Visit: కరోనా బాధితులకు ముఖ్యమంత్రి భరోసా.. గాంధీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
Cm Kcr At Gandhi Hospital

హైదారబాద్ న‌గ‌రంలోని గాంధీ ఆస్ప‌త్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సంద‌ర్శించారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. క‌రోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం ప‌రామ‌ర్శించి, ధైర్యంగా ఉండాల‌ని చెప్పారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను, సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 May 2021 05:35 PM (IST)

    మీకు ఏ సయం కావాలన్నా నన్ను సంప్రదించండి – సీఎం కేసీఆర్

    చాలా క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండి.. అద్భుతంగా సేవ చేస్తున్నారు. మీరు చేస్తున్న సేవలను ఇలాగే కొనసాగించండి. మీకు ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించండి అని గాంధీ వైద్య సిబ్బందిని ప్రశంసించారు సీఎం కేసీఆర్.

  • 19 May 2021 04:32 PM (IST)

    కాంట్రాక్టు నర్సులు, జూనియర్ డాక్టర్లను అభినందించిన సీఎం కేసీఆర్

    గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారు అంటూ అభినందించారు.

  • 19 May 2021 04:05 PM (IST)

    భోజనం ఎలా ఉంది- కోవిడ్ బాధితుడిని ప్రశ్నించిన సీఎం కేసీఆర్

    కోవిడ్ బాధితులతో ఆయన చాలా దగ్గరగా మాట్లాడారు. చికిత్స సరిగ్గా అందుతోందా ...అని ఓ బాధితుడిని ప్రశ్నించారు. భోజనం ఎలా ఉందని కూడా అడిగారు.

  • 19 May 2021 04:00 PM (IST)

    కోవిడ్ బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఇక్కడ ఫోటోలను చూడవచ్చు..

    గాంధీలోని అత్యవసర విభాగంలో సీఎం కేసీఆర్ సందర్శించారు. అక్కడ కోవిడ్ బాధితులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు భరోసా కల్పించారు.

  • 19 May 2021 03:57 PM (IST)

    గాంధీ ఆస్పత్రిలో సీఎం పర్యటిస్తున్న వీడియోను ట్వీట్ చేసిన తెలంగాణ సీఎంవో

    గాంధీ ఆస్పత్రిలోని కోవిడ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నవారిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరామర్శించినట్లుగా తెలంగాణ సీఎంవో ఓ ట్వీట్ చేసింది.. ఇందులో సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో పర్యటిస్తున్న వీడియోను షేర్ చేసింది,

  • 19 May 2021 02:31 PM (IST)

    డాక్ట‌ర్ల‌ను అభినందించిన సీఎం కేసీఆర్

    రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను సీఎం కేసీఆర్ అభినందించారు.

  • 19 May 2021 02:27 PM (IST)

    గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజ‌న్ ప్లాంటు ఏర్పాటు చేయండి..- సీఎం కేసీఆర్

    ఆక్సిజ‌న్, ఔష‌ధాల కొర‌త రాకుండా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. గాంధీ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ ప్లాంటు ఏర్పాటుపై అధికారుల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

  • 19 May 2021 02:02 PM (IST)

    తొలిసారిగా కేసీఆర్‌ సీఎం హోదాలో..

    తొలిసారిగా కేసీఆర్‌ సీఎం హోదాలో గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. స్వయంగా కేసీఆర్‌ గాంధీ ఆస్పత్రిలో పరిస్థితిని పరిశీస్తున్నారు. అనంతరం గచ్చిబౌలి టిమ్స్‌కు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు.

  • 19 May 2021 01:59 PM (IST)

    గాంధీ ఆస్పత్రిలో సుమారు 18 వందలకుపైగా బెడ్లు

    గాంధీ ఆస్పత్రిలో సుమారు 18 వందలకుపైగా బెడ్లు ఉన్నాయి. కోవిడ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న పేషెంట్లను సీఎం పరామర్శించి వసతులపై మాట్లాడారు.

  • 19 May 2021 01:59 PM (IST)

    బాధితులతో మాట్లాడిన సీఎం కేసీఆర్

    చికిత్స, వసతులపై ముఖ్యమంత్రి ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడారు. అలాగే  బాధితులతో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఆస్పత్రిలో మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  • 19 May 2021 01:56 PM (IST)

    ముఖ్యమంత్రి వెంట మంత్రి హరీశ్ రావు, సీఎంవో

    ప్రస్తుతం కేసీఆర్‌ వద్దే వైద్య ఆరోగ్యశాఖ ఉంది.ఈ నేపథ్యంలో ఆ శాఖ వ్యవహారాలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి హరీశ్ రావు, సీఎంవో అధికారులు ఉన్నారు.

  • 19 May 2021 01:56 PM (IST)

    గాంధీలో కొవిడ్ ఎమర్జెన్సీ వార్డును పరిశీలించిన సీఎం

    గాంధీలో కొవిడ్ ఎమర్జెన్సీ వార్డును పరిశీలించిన సీఎం... చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులను పరామర్శించారు. ఐసీయూలోని రోగులను పరామర్శించి ధైర్యం చెప్పిన సీఎం కేసీఆర్‌.. జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బందిని అభినందించారు.

  • 19 May 2021 01:55 PM (IST)

    సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్

    సీఎం కేసీఆర్‌ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో పర్యటించారు. కొవిడ్ చికిత్సలో కీలకంగా ఉన్న ఆస్పత్రిలో ఏర్పాట్లు, రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్సిజన్‌ వసతి, ఔషధాల సరఫరా తదితర అంశాలపై ఆరా తీశారు. 40 నిమిషాల పాటు గాంధీ ఆస్పత్రిలో సీఎం పర్యటించారు

  • 19 May 2021 01:38 PM (IST)

    గాంధీ ఆస్ప‌త్రిని సందర్శించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

    హైద‌రాబాద్ న‌గ‌రంలోని గాంధీ ఆస్ప‌త్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సంద‌ర్శించారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. క‌రోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల‌ను సీఎం ప‌రామ‌ర్శించి,

Published On - May 19,2021 5:35 PM

Follow us
Latest Articles