Private Teachers : టీవీ 9 ఎఫెక్ట్ : పెండింగ్ లో ఉన్న ప్రయివేట్ టీచర్లకు రూ. రెండు వేలు చొప్పున్న బ్యాంక్ అకౌంట్లలో జమ
Financial assistance to Private Teachers : కరోనా లాక్ డౌన్ల కష్టకాలంలో ఒకవైపు భారీగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు, మరోవైపు లేని ఉద్యోగాలతో ప్రయివేటు టీచర్లు నానా యాతన పడుతున్నారు...
Financial assistance to Private Teachers : కరోనా లాక్ డౌన్ల కష్టకాలంలో ఒకవైపు భారీగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు, మరోవైపు లేని ఉద్యోగాలతో ప్రయివేటు టీచర్లు నానా యాతన పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ సర్కారు ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు నడుంబిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ప్రయివేటు టీచర్లకు సాయం అందించగా, పెండింగ్‌లో ఉన్న ప్రైవేట్ టీచర్లకు రూ.2 వేల ఆర్థిక సహాయం వారి వారి అకౌంట్స్ లో ఇవాళ డిపాజిట్ చేసింది తెలంగాణ విద్యా శాఖ. మొత్తం 79 వేల మంది అకౌంట్స్ లో డబ్బులు జమ చేశారు. ఇప్పటికే 1.25 లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్ సిబ్బందికి ఆర్థికసాయాన్ని విద్యాశాఖ అందించింది. కాగా, ప్రయివేటు టీచర్ల వెతల్ని వరుస కథనాల ద్వారా టీవీ9 ప్రస్తావించిన సంగతి తెలిసిందే. వాళ్ల దీన గాథల్ని ప్రభుత్వాల కళ్లకు కట్టింది టీవీ9.