రాయల్ బెంగాల్ టైగర్ దాడిలో జూ అటెండెంట్ మృతి, అరుణాచల్ ప్రదేశ్ లో విషాదం, ఇదే తొలి ఘటన అంటున్న క్యూరేటర్
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ లో గల బయలాజికల్ పార్క్ లో దారుణం జరిగింది. ఈ జూలో ఎనిమిదేళ్లుగా ఉంటున్న రాయల్ బెంగాల్ టైగర్ ఉన్నట్టుండి రెచ్సిపోయింది. మంగళవారం మధ్యాహ్నం 35 ఏళ్ళ పౌలాష్ కర్మాకర్ అనే అటెండెంట్ దీని ఎన్ క్లోజర్ లో...
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ లో గల బయలాజికల్ పార్క్ లో దారుణం జరిగింది. ఈ జూలో ఎనిమిదేళ్లుగా ఉంటున్న రాయల్ బెంగాల్ టైగర్ ఉన్నట్టుండి రెచ్సిపోయింది. మంగళవారం మధ్యాహ్నం 35 ఏళ్ళ పౌలాష్ కర్మాకర్ అనే అటెండెంట్ దీని ఎన్ క్లోజర్ లో గల నీటి కొలనును శుభ్రం చేయడానికి ప్రవేశించగానే అది దాడి చేసింది. అనుకోని ఈ సంఘటనతో పౌలాష్ కనీసం పారిపోవడానికి కూడా ప్రయత్నించలేకపోయాడని జూ క్యూరేటర్ రాయా ఫ్లాగ్ తెలిపారు. సమాచారం తెలియగానే తాను ఓ డాక్టర్ తోను, స్టాఫ్ తోను అక్కడికి చేరుకోగా అప్పటికే పౌలాష్ మరణించాడని ఆయన చెప్పారు. ఈ పులి ఉన్న పెద్ద బోను మూడు ద్వారాలూ తెరిచే ఉన్నాయని, బహుశా దీనివల్లే పులి ఒక్కసారిగా ఇతనిపై ఎటాక్ చేసి ఉంటుందని ఆయన అన్నారు. ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో అనుమానాస్పదమైనదేమీ లేదని పోలీసులు భావిస్తున్నప్పటికీ.. జూ అధికారుల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అస్సాంలోని లఖిమ్ పూర్ జిల్లాకు చెందిన పౌలాష్ కొంతకాలంగా ఈ జూలో పని చేస్తున్నట్టు తెలిసింది. పులి దాడిలో ఇతని ముఖమంతా తీవ్రంగా గాయమైంది.
‘చిప్పి’ అనే పేరున్న ఈ రాయల్ బెంగాల్ టైగర్ ని దీని ఎనిమిది నెలల వయస్సులో మరో పులి కూనతో బాటు తీసుకువచ్చారు. 2013 నుంచి అవి ఈ జూలో ఉంటున్నాయి. ఇది ఆడపులి అని, సహజంగా మనుషులకు మాలిమి అయిందేనని,కానీ ఇలా ఎందుకు దాడి చేసిందో తెలియడంలేదని క్యూరేటర్ పేర్కొన్నారు. జరిగిన ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
Deepest condolences to the bereaved family of late Poulash Karmakar, mauled by a Tigress yesterday at Biological Park, #Itanagar. Visited the zoo to take stock. Govt. will duly compensate for the irreparable loss. Prayers for the departed soul?? @ArunachalCMO @ArunForests pic.twitter.com/vlPxEE2lTG
— Mama Natung (@NatungMama) May 19, 2021
మరిన్ని చదవండి ఇక్కడ : Lockdown Violation : నాగిని డ్యాన్స్ వేపించిన పోలీసులు…వైరల్ అవుతున్న వీడియో.లాక్ డౌన్ నియమాలు అతిక్రమిస్తే ఇక అంతే ..