Fact Check: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ టైమింగ్ మారిందా.? ఇందులో నిజమెంత.!
AP Curfew Timings: కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ ఈ నెలాఖరు దాకా రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన..
AP Curfew Timings: కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ ఈ నెలాఖరు దాకా రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ లాక్‌డౌన్ విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఈ నెల 20వ తేదీ నుంచి ఏపీలో లాక్ డౌన్ సమయాల్లో మార్పులు జరిగాయని.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని’ ఆ వార్త సారంశం. దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం స్పష్టతను ఇచ్చింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది. కర్ఫ్యూ సమయాల్లో ఎలాంటి మార్పులు జరగలేదని.. గతంలో మాదిరిగానే మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుందని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చీఫ్ సెక్రటరీ హెచ్చరించారు.
There is no change in the daily relaxation period of 6:00 am till 12:00 noon in the extended curfew till 31st May 2021.
The malicious message circulating on whatsapp claiming a change in daily relaxation period from 20th may is false.
Full story: https://t.co/n5564Y2e8h pic.twitter.com/P6TmYB7Yaz
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) May 18, 2021
ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 21,320 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేసిన ప్రతి 100 మందిలో దాదాపు 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,923 మంది వైరస్ బారిన పడ్డారని, ఆ తర్వాత అనంతపూర్ జిల్లాలో 2,804, చిత్తూరు జిల్లాలో 2,630, విశాఖపట్నం జిల్లాలో 2368లలో అత్యధిక కేసులు నమోదైనట్లు వివరించారు. ఇక, గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా 99 మంది మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read:
ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..
అద్భుతమైన పోస్టాఫీస్ స్కీమ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..