సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో సింగర్ అర్జిత్ సింగ్ తల్లి మృతి.. సాయం కోసం అభ్యర్థించిన ఫలితం లేదు..
Arijit Singh: కరోనా వైరస్.. ఇప్పుడు దేశంలో విజృంభిస్తున్న భయంకర వైరస్.. రోజు రోజుకీ ఈ మహమ్మారి బారిన పడి వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
Arijit Singh: కరోనా వైరస్.. ఇప్పుడు దేశంలో విజృంభిస్తున్న భయంకర వైరస్.. రోజు రోజుకీ ఈ మహమ్మారి బారిన పడి వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది ఈ వైరస్ సృష్టించిన విలయం కంటే రెండో దశలో రెట్టింపు స్థాయిలో విజృంభిస్తుంది. గత రెండు మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినా కానీ.. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇక రాష్ట్రాలు పాటిస్తున్న లాక్ డౌన్ ప్రభావం మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తున్న కరోనా మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంది. వైరస్ ముందు సామాన్యులు, సెలబ్రెటీలు అనే తేడా ఏం లేదు. ఎవరైనా సరే ఈ కరోనాకు బలి కావాల్సిందే అనే విధంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తమ ఆత్మీయులను కోల్పోయారు. తాజాగా బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కూడా తన తల్లిని పోగొట్టుకున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జిత్ సింగ్ ఫేమస్ సింగర్. ఆషికీ 2 సినిమాలో తుమ్ హీ హో, కబీరా, సునోనా సంగ్‌మర్‌మర్, మస్త్ మగన్, రాత్ భర్, సంజావన్ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తెలుగులో కూడా పలు పాటలు ఆలపించారు. ఇదిలా ఉంటే అర్జిత్ సింగ్ తల్లి.. కరోనా లక్షణాలతో కోలకత్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వస్థికా ముఖర్జి వెల్లడించారు. కోల్‌కతాలోని ప్రముఖ ఆస్పత్రి ఎఎమ్ఆర్‌ఐలో అర్జిత్ తల్లి వైద్యం తీసుకుంటున్నారని చెప్పిన స్వస్థికా.. ఆమెకు ఏ నెగటివ్ రక్తం అవసరం ఉందని..దయచేసి సహాయం చేయాలని కోరారు. కానీ వీరి ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. అర్జిత్ తల్లి చికిత్స తీసుకుంటూ గురువారం ఉదయం 11 గంటలకు ఆమె సెరిబ్రల్ స్ట్రోక్ తో కన్నుముశారు. ఆమె మృతికి పలువురు సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేశారు.