AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bobby Driessen: నిద్రలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు.. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ

సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియన్ నటుడు బాబీ డ్రైసెన్ కన్నుమూశారు. 56 ఏళ్ల వయసున్న ఆయన నిద్రలోనే చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 'యంగ్ ట్యాలెంట్ టైమ్’ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బాబీ హఠాన్మరణాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Bobby Driessen: నిద్రలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు.. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ
Bobby Driessen
Basha Shek
|

Updated on: Dec 31, 2022 | 12:11 PM

Share

ఇటీవల సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత నాలుగు నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమ పలువురి దిగ్గజ నటులను కోల్పోయింది. తాజాగా సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియన్ నటుడు బాబీ డ్రైసెన్ కన్నుమూశారు. 56 ఏళ్ల వయసున్న ఆయన నిద్రలోనే చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ‘యంగ్ ట్యాలెంట్ టైమ్’ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బాబీ హఠాన్మరణాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతికి సహా నటీనటులు, ఆస్ట్రేలియా సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా యంగ్ ట్యాలెంట్ టైమ్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు బాబీ. చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇలా హఠాత్తుగా కన్నుమూశాడని తెలిసి ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. బాబీ 1966లో ఏప్రిల్ 26న జన్మించారు. నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.1979 నుండి 1983 వరకు యంగ్ టాలెంట్ టైమ్‌ ప్రోగ్రాంలో రెగ్యులర్ పెర్ఫార్మర్ గా వర్క్ చేశారు బాబీ. దీంతో పాటు నెయిబర్(1985) టీవీ సిరీస్, యంగ్ టాలెంట్ టైమ్ టెల్స్ ఆల్(2001) ప్రోగ్రామ్స్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి.

కాగా బాబీ హఠాన్మరణంతో ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. ‘యంగ్ టాలెంట్ టైమ్‌ లో మేమంతా కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు మా టీమ్ లో ఒకరైన బాబీ మరణించారనే వార్త వినడం బాధాకరంగా ఉంది’ అని ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మరణం తర్వాత కూడా గుర్తుంచుకునే వ్యక్తులలో బాబీ ఒకరని మరొకరు పోస్ట్‌ షేర్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..