AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avatar 2 Boxoffice : అదే దూకుడు కంటిన్యూ చేస్తోన్న అవతార్2.. రెండు వారాలకు అదిరిపోయే కలెక్షన్స్

ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా నయా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే భారీ ఓపినింగ్స్ తో అదరగొట్టిన అవతార్2 ఇప్పటికీ అదే దూకుడుతో దూసుకుపోతోంది.

Avatar 2 Boxoffice : అదే దూకుడు కంటిన్యూ చేస్తోన్న అవతార్2.. రెండు వారాలకు అదిరిపోయే కలెక్షన్స్
Avatar 2
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2022 | 3:42 PM

Share

ఇటీవల విడుదలైన భారీ సినిమాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది అవతార్ 2 సినిమా గురించి. జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన అద్భుత సృష్టి అవతార్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే..అవతార్ 2 సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా నయా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే భారీ ఓపినింగ్స్ తో అదరగొట్టిన అవతార్2 ఇప్పటికీ అదే దూకుడుతో దూసుకుపోతోంది. గతంలో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సుమారు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 160 భాషలలో విడుదలై సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఇక ఈ సినిమా రెండో వారంలోనూ  అదే హవా కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అవతార్ 2 కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. నైజాం 26.17 కోట్లు, సీడెడ్ 5.72 కోట్లు, ఉత్తరాంధ్ర 6.48 కోట్లు, ఈస్ట్, వెస్ట్ కలిపి 2.83 కోట్లు అలాగే కృష్ణా, గుంటూరు కలిపి 5.28 కోట్లు, ఇక నెల్లూరు 2.39 కోట్లు వసూల్ చేసింది. మొత్తంగా ఏపీ, తెలంగాణ కలిపి 48.87 కోట్లు వసూల్ చేసింది ఈ సినిమా.

ఇవి కూడా చదవండి

2 వారాలు పూర్తయ్యేసరికి రూ.48.87 కోట్ల భారీ షేర్ ని కలెక్ట్ చేసింది ‘అవతార్ 2’ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో మరి కొద్దిరోజులు తెలుగురాష్ట్రాల్లో ఇదే తరహా కలెక్షన్స్ వసూల్ చేసే అవకాశం ఉంది. ఇక సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు అజిత్ తెగింపు, విజయ్ వారసుడు సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే