Unstoppable: ఓటీటీలో బాలయ్య సింహనాదం.. అన్‌స్టాపబుల్ కోసం కోట్లు ఇచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ రెడీ !

బాలయ్య.. కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌లో ఉన్నారు. అటు సినిమాల పరంగా, ఇటు ఓటీటీలో దున్నేస్తున్నారు. సూపర్ పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతున్నారు.

Unstoppable: ఓటీటీలో బాలయ్య సింహనాదం.. అన్‌స్టాపబుల్ కోసం కోట్లు ఇచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ రెడీ !
Nandamuri Balakrishna
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 31, 2022 | 1:18 PM

ఆయన అడుగెడితే.. షో మొదలెడితే.. అరె గుండీలు తీసి కాలర్ ఎగరేస్తే.. పైసా వసూలే. పాజిటివ్ ఎనర్జీతో దున్నేస్తున్నాడు బాలయ్య. గతంలో ఉన్న నెగటివ్ ఇమేజ్ అంతా పోయింది. సినిమాలు వరసగా బ్లాక్ బాస్టర్స్ అవుతున్నాయి. బాయల్యది కల్మషం లేని మనసు అని తెలిసిపోయింది. పసి పిల్లాడి తత్వమని అర్థమయ్యింది. దీంతో బాలయ్యను ఓన్ చేసుకుంటున్నారు చాలామంది. ఇదంతా పక్కనబెడితే.. బాలయ్యను ఓటీటీ కింగ్‌ అని చెప్పొచ్చేమో.  ఆహాలో చేస్తున్న అన్‌స్టాపబుల్ నెక్ట్స్ రేంజ్‌లో హిట్ అయ్యింది. హోస్టింగ్‌లో తాను ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. అటు సీనియర్ నటులను, ఇటు కుర్ర హీరోలను, మరోవైపు పొలిటికల్ లీడర్స్‌ను రఫ్పాడిస్తున్నారు. పంచ్‌లు, ప్రాసలతో హోరెత్తిస్తున్నారు. ఆటపాటలతో మనసులు గెలుచుకుంటున్నారు. దీంతో ఆహా సబ్‌స్క్రిప్షన్స్ కోసం జనాలు ఎగబడ్డారు. అల్లు అరవింద్‌కు కాసుల పంట పండింది.

అటు ఈ ఏడాది జనవరిలో ఓటీటీలోకి వచ్చిన అఖండ అయితే కుళ్లబొడిచేసింది. నార్త్ జనాలు సైతం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో హాట్ స్టార్‌ వాళ్లకు ఊహించనంత డబ్బులు వచ్చిపడ్డాయి. తాము ఎన్నో ఆశలు పెట్టుకున్న సిరీస్‌లు, సినిమాలు నీరు గారి పోతున్న వేళ.. బాలయ్య అఖండతో వారికి అండగా నిలిచాడు. ఏంటి ఈయన.. ఈ ఫాలోయింగ్ ఏంటి అని హాట్ స్టార్.. మేనేజ్‌మెంట్ వాళ్లు ఒకింత కంగుతిన్నారంట. ఇలా ఓటీటీలో తన మార్క్ వేసేశారు బాలయ్య. ఇటీవల రిలీజైన ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ దుమ్మురేపుతోంది. పవన్ ఎపిసోడ్‌పై అయితే అంచనాలు మాములుగా లేవు. విపరీతమైన బజ్ ఉంది.

దీంతో మరో ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ నెటిఫిక్స్.. ఎంత రేటు అయినా సరే.. అన్‌స్టాపబుల్ 1, 2 సీజన్లు కొనాలని డిసైడయ్యింది అట. అంతేకాదు.. పవన్ ఎపిసోడ్  అటు ఆహాలో, ఇటు నెట్‌ఫ్లిక్స్‌లో ఒకేసారి ప్రసారం అయ్యేలా డీల్ మాట్లాడుతున్నట్లు టాక్. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు, మరో రెండు అగ్ర OTT ప్లాట్‌ఫామ్స్‌ కూడా టాక్ షోను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా తెలుస్తోంది. మరి, అల్లు అరవింద్ “అన్‌స్టాపబుల్”ను తమ వద్దే ఉంచుకుంటారా లేదా నెట్‌ఫ్లిక్స్‌కి రీ-టెలికాస్ట్ హక్కులను విక్రయిస్తారో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి