Prabhas: ఒక్క టైరు కోసం ఇంత కష్టమా.. ప్రాజెక్ట్ కే మరో మాస్టర్ పీసే అబ్బా.. వీడియో చూసేయ్యండి..

అత్యంత ప్రతిష్టాత్మకంగా బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో డార్లింగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలకపాత్రలో నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.

Prabhas: ఒక్క టైరు కోసం ఇంత కష్టమా.. ప్రాజెక్ట్ కే మరో మాస్టర్ పీసే అబ్బా.. వీడియో చూసేయ్యండి..
Prabhas, Project K
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2022 | 1:13 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ ఆ రెండు చిత్రాలపైనే ఉన్నాయి. అవే కేజీఎఫ్ చిత్రంతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ కాగా.. మరొకటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె. ముందునుంచి ఈ రెండు చిత్రాలపై భారీగానే అంచనాలున్నాయి. ఒకటి ఫుల్ మాస్ యాక్షన్ చిత్రం కాగా.. మరొకటి మునుపెన్నడు డార్లింగ్ కనిపించని థ్రిల్లింగ్ సినిమా. అత్యంత ప్రతిష్టాత్మకంగా బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో డార్లింగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలకపాత్రలో నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా న్యూఇయర్ కానుకగా మరో ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

అందులో ఈ సినిమాలో ఉపయోగించడం కోసం టైర్ ను ఎలా కనిపెట్టారో చూపించారు. ఒక్క టైర్ తయారు చేయడానికి చిత్రయూనిట్ ఎంతగా కష్టపడిందో ఇందులో చూపించారు. అయితే తాజాగా విడుదలైన వీడియో చూస్తుంటే ఈసినిమాలో ఆ టైర్ చాలా కీలకంగా కనిపిస్తుంది. దీంతో మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాను దాదాపు 400 కోట్లతో నిర్మిస్తున్నారు వైజయంతి మూవీస్.

అయితే ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఎలాంటి అప్డే్ట్స్ ఇవ్వలేదు. డార్లింగ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్స్ మినహా… మరేలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి ఇంట్రెస్టింగ్ వీడియోతో న్యూయర్ సర్ ప్రైజ్ ఇచ్చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి