Rishab Shetty: రష్మికను హీరోయిన్గా మలిచిన కిరిక్ పార్టీ విడుదలై ఆరేళ్లు.. ఆ ఒక్క ట్వీట్‌తో మరోసారి కౌంటరిచ్చిన రిషబ్ శెట్టి..
అటు దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది రష్మిక. కానీ ఇటీవల కొద్దిరోజులుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. గతంలోఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. తనను హీరోయిన్ గా పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో రష్మిక మందన్నా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. అటు దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. కానీ ఇటీవల కొద్దిరోజులుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. గతంలోఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. తనను హీరోయిన్ గా పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ చేతి వేళ్లతో చూపించింది. తే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి రష్మికకు పరోక్షంగా కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె ప్రవర్తనపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను కన్నడలో బ్యాన్ చేయనున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే రష్మిక స్పందిస్తూ.. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా రిషబ్ శెట్టి పెట్టిన ట్వీట్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్న సంగతి నిజమేనని తెలుస్తోంది.
రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, రష్మిక జంటగా నటించిన చిత్రం కిరిక్ పార్టీ. ఈ మూవీతోనే ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2016లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ శుక్రవారంతో ఈ మూవీ విడుదలై ఆరేళ్లు పూర్తయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు రిషబ్ శెట్టి. మా సినిమా విడుదలై ఆరేళ్లు అయినప్పటికీ.. మా కోసం మీరు చేసిన సందడి.. థియేటర్లలో మీరు వేసిన విజిల్స్ అన్నీ మా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మమ్మల్ని మరోసారి ఆ రోజుల్లోకి తీసుకువెళ్తున్నాయి. ఈ సెలబ్రేషన్స్ లో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ హీరో రక్షిత్, నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్, మ్యూజిక్ డైరెక్టర్ లోక్ నాథ్ ను ట్యాగ్ చేశాడు. కానీ ఇందులో కథానాయికగా నటించిన రష్మికను మాత్రం ట్యాగ్ చేయకపోవడంతో వీరిద్దరి గొడవలు నిజమనే టాక్ తెరపైకి వచ్చింది.




గతంలో కాంతార సినిమాను చూశారా అని అడగ్గా.. ఇంకా చూడలేదని చెప్పింది. దీంతో కన్నడ సంప్రదాయాన్ని తెలియజేసే సినిమాను చూసేందుకు టైమ్ లేదా అంటూ ట్రోల్ చేశారు. ఇక ఆ తర్వాత నిర్మాణ సంస్థ పేరు చెప్పకపోవడంలోనూ రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు రిషబ్ శెట్టి చేసిన ట్వీట్ కు రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
‘ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ’ ನೆಡೆದು ಆರು ವರ್ಷಗಳ ನಂತರವೂ ಪಾರ್ಟಿಗೆ ಕಳೆ ತಂದ ನಿಮ್ಮ ಸದ್ದು, ಗದ್ದಲ, ಸಿಳ್ಳೆಗಳು ಇನ್ನೂ ಕಿವಿಯಲ್ಲಿ ಪ್ರತಿಧ್ವನಿಸುತ್ತಿವೆ. ಮತ್ತೆ ಹಿಂತಿರುಗಿ ನೋಡುವಂತೆ ಮಾಡುತ್ತವೆ. ಈ ಸಂಭ್ರಮದ ಭಾಗವಾದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. @rakshitshetty @ParamvahStudios @AJANEESHB #KirikParty pic.twitter.com/Rgaq5Lywmq
— Rishab Shetty (@shetty_rishab) December 30, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.