Actor : ఒకప్పుడు తోపు యాక్టర్.. స్టార్ హీరోలతోనే సినిమాలు.. ఇప్పుడు అపార్ట్మెంట్ వాచ్ మెన్..
సినీరంగుల ప్రపంచంలో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు చాలా మంది ఉన్నారు. కానీ వెండితెరపై నవ్వులు పంచి నిజ జీవితంలో మాత్రం చీకటి రోజులు ఎదుర్కొంటున్నవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ నటుడు మాత్రం ఇండస్ట్రీలో తోపు యాక్టర్. కానీ ఇప్పుడు బతుకుదేరువు కోసం వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరంటే..

ఒకప్పుడు సినిమాల్లో వివిధ పాత్రలతో అలరించిన నటీనటులు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరి జీవిత కష్టాల గురించి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. స్టార్ హీరోలతో కలిసి అనేక సినిమాలు చేసిన ఒక నటుడు ఇప్పుడు వాచ్ మెన్ జాబ్ చేస్తున్నాడు. గులాల్ , బ్లాక్ ఫ్రైడే , పాటియాలా హౌస్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించిన మెప్పించాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ నటుడి పేరు సావి సిద్ధు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
ప్రస్తుతం అతడు ముంబైలోని పరేల్‌లోని ఒక భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతడి ఆరోగ్యం క్షీణించడం వల్ల నటనకు విరామం తీసుకున్నట్లు తెలిపాడు. అనారోగ్య సమస్యలు తగ్గినప్పటికీ తనకు అవకాశాలు రాలేదు.. అందుకే తాను ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో అన్నారు సావి సిద్ధు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
తాను సినిమాల్లోకి రావాలనుకుంటున్నానని.. కానీ సరైన అవకాశం రావడం లేదని అన్నారు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, రాజ్ కుమార్ రావు వంటి సెలబ్రెటీలతో కలిసి కనిపించాడు సావి సిద్ధు. ముఖ్యంగా అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన పాంచ్ చిత్రంతో సినీప్రయాణం స్టార్ట్ చేశాడు సావి సిద్ధు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యాడు. ఇప్పుడు వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

Savi Sidhu Life
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..




