AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కోట్ల లాభం వస్తదని ఉన్న డబ్బంతా పంపిన మాజీ ఐపీఎస్ భార్య.. చివరకు ఊహించని షాక్..

సైబర్‌ నేరగాళ్ల కన్ను పడితే.. సామాన్యులే కాదు, చట్టాన్ని రక్షించే అగ్రస్థాయి అధికారుల కుటుంబాలు కూడా చిక్కి విలవిలలాడిల్సిందే. తాజాగా హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఒక భారీ మోసం ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి భార్యనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు.. ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Hyderabad: కోట్ల లాభం వస్తదని ఉన్న డబ్బంతా పంపిన మాజీ ఐపీఎస్ భార్య.. చివరకు ఊహించని షాక్..
Ips Officer Wife Scammed
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jan 10, 2026 | 8:06 PM

Share

పెట్టుబడుల పేరిట సైబర్‌ నేరగాళ్లు మరోసారి భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ సారి వారి వలలో చిక్కింది మాజీ ఐపీఎస్‌ అధికారి భార్య. స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌లో అదిరిపోయే ప్రాఫిట్స్ వస్తాయని నమ్మించి, దాదాపు రూ.2.58 కోట్లను సైబర్‌ మోసగాళ్లు కాజేశారు. బాధితురాలి భర్త గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారిగా తెలుస్తోంది. తొలుత స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులపై చిట్కాలు అందిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు వాట్సప్‌ ద్వారా మెసేజ్‌లు పంపారు. ట్రేడింగ్‌పై అవగాహన లేకపోవడంతో బాధితురాలు తన భర్త మొబైల్‌ నంబర్‌ను కూడా ఆ వాట్సప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేయించారు. అనంతరం 500 శాతం వరకు లాభాలు వస్తాయని ఆశ చూపించారు.

ఇది సెబీ సర్టిఫైడ్‌ వెబ్‌సైట్‌ అంటూ నమ్మించేందుకు నకిలీ సెబీ డాక్యూమెంట్స్ కూడా పంపించారు. వారి మాటలను నమ్మిన బాధితురాలు డిసెంబర్‌ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు వరుసగా ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టారు. మొత్తం 19 లావాదేవీల ద్వారా రూ.2.58 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. కొంతకాలం తర్వాత పెట్టుబడులు నిలిపివేయడంతో, సైబర్‌ నేరగాళ్లు మళ్లీ డబ్బులు పెట్టాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. మరింత పెట్టుబడి పెట్టకుంటే ఇప్పటి వరకు పెట్టిన మొత్తం నష్టపోతుందని బెదిరించారు. ఈ దశలోనే మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పెట్టుబడుల పేరిట జరుగుతున్న సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన కండోమ్స్‌ కంపెనీ!
పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన కండోమ్స్‌ కంపెనీ!
కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!
కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం
షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం