అందుకే అలాంటి ఫోటోలు షేర్ చేస్తున్నా..! అసలు విషయం చెప్పిన అనన్య నాగళ్ల
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల తార . మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది.

తెలుగు ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసి మెప్పిస్తుంది. మల్లేశం సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నప్పటికీ అవి హిట్ టాక్ తెచ్చుకోలేకపోతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనన్య ఆసక్తికర కామెంట్స్ చేసింది.
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
అనన్య ముంబై నుండి వచ్చిన వారికి అవకాశాలు త్వరగా లభిస్తాయని అన్నారు. అయితే, తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీలో లాంగ్ కెరీర్ ఉంటుందని ఆమె గట్టిగా నమ్ముతున్నట్టు తెలిపింది. తెలుగు అమ్మాయిలం లాస్ట్ ఐదు, ఆరు సంవత్సరాల నుంచే వస్తున్నాము. మరో ఐదు సంవత్సరాల తర్వాత చూసుకున్నా మేము ఇక్కడే ఉంటాము అని ఆమె అన్నారు. మొదట్లో తానూ ముంబై నుండి వచ్చిన వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయనుకున్నానని, కానీ గత రెండు సంవత్సరాలుగా తన తన ఆలోచన మారింది అని అనన్య తెలిపింది. వారికి ఎక్కువ అవకాశాలు వచ్చినా, తెలుగు నటీమణులకు కెరీర్‌లో నిలదొక్కుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని అనన్య తెలిపింది.
13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
అలాగే మల్లేశం, ప్లే బ్యాక్, వకీల్ సాబ్ వంటి సినిమాలలో సాంప్రదాయక పాత్రలలో కనిపించిన అనన్య, తన లుక్ ను మార్చుకోవడం గురించి మాట్లాడుతూ.. మొదట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫ్యాషనబుల్ ఫోటోలు ఉన్నప్పటికీ, ఈ మూడు సినిమాల తర్వాత ప్రజలు తనను కేవలం సాంప్రదాయక నటిగానే చూశారని తెలిపింది. శాకుంతలం చిత్రం షూటింగ్ సమయంలో గ్లామరస్ ఫోటోషూట్స్ చేయడం వల్ల తనలో బీడియం పోయిందని తెలిపింది.. నటులు 360 డిగ్రీలలో అన్నింటినీ అన్వేషించాలని తెలిపింది. అందుకే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నా అని తెలిపింది. అలాగే ఇటీవల సైమా అవార్డ్స్ లో ఆమె గ్లామరస్ లుక్ గురించి మాట్లాడుతూ.. పబ్లిక్ ఈవెంట్ లో అంత గ్లామరస్ గా కనిపించడం తనకు అదే మొదటిసారి అని అనన్య తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
