AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: భీమాళి మామిడి తాండ్రకు ప్రత్యేక గుర్తింపు.. రైతులకు అండగా సర్కార్ సరికొత్త ప్లాన్..

విజయనగరం జిల్లా అంటేనే నోరూరించే మామిడి తాండ్రకు పెట్టింది పేరు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ సంప్రదాయ రుచికి ఇప్పుడు మరింత గుర్తింపు లభించనుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఒక జిల్లా – ఒక ఉత్పత్తి కింద ఈ జిల్లా నుంచి మామిడి తాండ్రను ప్రతినిధి ఉత్పత్తిగా ఎంపిక చేశారు. భీమాళి ప్రాంతంలో తయారయ్యే ఈ తాండ్రను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చేందుకు జిల్లా కలెక్టర్ భారీ ప్రణాళికను సిద్ధం చేశారు.

Andhra Pradesh: భీమాళి మామిడి తాండ్రకు ప్రత్యేక గుర్తింపు.. రైతులకు అండగా సర్కార్ సరికొత్త ప్లాన్..
Vizianagaram Mango Jelly
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Jan 10, 2026 | 7:36 PM

Share

విజయనగరం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక గుర్తింపునిచ్చే లక్ష్యంతో అమలు చేస్తున్న ఒక జిల్లా – ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా మామిడి తాండ్ర జిల్లాకు ప్రతినిధి ఉత్పత్తిగా ఎంపికైంది. ఈ నిర్ణయం స్థానికంగా తయారయ్యే సంప్రదాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఎల్ కోట మండలం భీమాళి ప్రాంతంలో తయారయ్యే మామిడి తాండ్ర నోరూరించే ప్రత్యేక రుచిగా మంచి పేరు ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏటా సుమారు 500 మెట్రిక్ టన్నుల వరకు మామిడి తాండ్ర ఉత్పత్తి జరుగుతోందని అధికారిక అంచనాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తిని మరింత అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నారు.

మామిడి తాండ్రకు సంబంధించిన విస్తరణ, అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ రామసుందరరెడ్డి ఆదేశించారు. ముడిసరుకు నుంచి తయారీ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వరకు అన్ని దశలను సమన్వయంతో అమలు చేయాలని సూచించారు. దీనివల్ల స్థానిక రైతులు, తాండ్ర తయారీదారులు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక బలం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ చిన్న స్థాయి పరిశ్రమలుగా మామిడి తాండ్ర తయారీ యూనిట్లను అభివృద్ధి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు తమ శాఖల ద్వారా అందించాల్సిన సహకారం పై చర్చించారు. మామిడి తాండ్రను జిల్లాకు గర్వకారణంగా నిలిపేలా సమిష్టి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!
కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం
షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం
కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన..
కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన..